Epilepsy – మూర్చ వ్యాధికి ప్రధాన కారణాలు ఏంటి…? ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి…?

By manavaradhi.com

Updated on:

Follow Us

భారత్ లాంటి దేశాల్లో చాలా అనారోగ్య సమస్యల విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. అలాంటి వాటిలో మూర్చ కూడా ఒకటి. నిజానికి మెదడుకు సంబంధించిన సాధారణ రుగ్మతల్లో మూర్చ కూడా ఒకటి. సమస్య మరింత తీవ్రమైనప్పుడు మూర్చ వ్యాధిని గుర్తించడం సాధ్యమౌతుంది. మూర్చ విషయంలో అపోహలు ఏమిటి, ఈ సమస్యకు పరిష్కార మార్గాలు ఏమిటో తెలుసుకుందామా.

మెదడులోని న్యూరాన్లు శరీరం మొత్తానికి కదలికల్లో సాయం చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ న్యూరాన్ల నుంచి తప్పుడు సంకేతాలు అందుతాయో దానినే మూర్చగా చెబుతారు. ప్రతి వెయ్యి మందిలో ఒకరు మూర్చతో ఇబ్బంది పడుతున్నారు. నవజాత శిశువులు మొదలుకుని, పెద్ద వారికి వరకూ వయసుతో, లింగబేధంతో సంబంధం లేకుండా ఈ సమస్య విస్తరిస్తోంది. మూఢనమ్మకాల కారణంగా ఈ సమస్యకు కారణాలను శాస్త్రీయ కోణంలో చూడకుండా, ఇతర మార్గాలను అనుసరించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రారంభంలో మూర్చవ్యాధి లక్షణాలు పెద్దగా బయటకు కనిపించవు. ఆ తర్వాత క్రమంగా దీర్ఘకాలంలో ఈ సమస్య పెరుగుతూ వచ్చి, అపస్మారక స్థితికి దారి తీస్తుంది. వ్యక్తికి, వ్యక్తికి మధ్య కూడా మూర్చ వ్యాధి తీవ్రత వేరు వేరుగా ఉంటుంది. కొందరు స్పృహ కోల్పోతుంటారు. శరీరంలో వణుకును ఆపడం కూడా కొన్ని సమయాల్లో కష్టంగా మారుతుంది. మూర్చ సమస్య మొదలయ్యాక కచ్చితంగా రెండు మూడు మార్లు ఈ సమస్య ఎదురయ్యే లోపే వైద్యుని సంప్రదించడం ద్వారా సమస్య తీవ్రతను బాగా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్క సారి ఈ సమస్య మొదలయ్యాక దీర్ఘకాలిక చికిత్స అవసరం. కనీసం రెండేళ్ళయినా మూర్చ సమస్యకు చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

మూర్చ వ్యాధికి కచ్చితంగా కారణాలు ఇవే అని కూడా చెప్పలేము .మెదడులో రసాయనాలు తేడాలు, మెదడు ఇన్ఫెక్షన్లు, జన్యు లోపాలు, కేంద్ర నాడీ వ్యవస్థ లోపాలు, పుట్టకతోనే మెదడు దెబ్బ తినడం లాంటి కారణాలు మూర్చకు కారణాలు. ఆందోళన, మానసిక రుగ్మతల కారణంగా టెన్షన్ గా ఉన్నప్పుడు మూర్చ వస్తుంటుంది. అలాగే నిద్రలేమి కారణాగా ఆల్కాల్ తీసుకోవడం, హార్మోన్లలో మార్పులు దీనికి దారి తీస్తాయి. ఇంత సమస్య వచ్చినప్పటికీ ఫిట్స్ తగ్గిన తర్వాత వారికి ఇతర విషయాలు గుర్తుండవు. ఈ సమస్య విషయంలో వీలైనంత త్వరగా వైద్యుని సంప్రదించడం తప్పనిసరి. రోగి చెప్పే విషయాలను బట్టి ప్రాథమికంగా సమస్య స్థాయిని అంచనా వేయవచ్చు. మెదడులోని ఏ భాగంలో లోపాలు ఉన్నాయో కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకుని, చికిత్స చేయవలసి ఉంటుంది. ఏ పరీక్షలు అవసరమనే విషయాన్ని, సమస్య తీవ్రత మేరకు వైద్యులు సూచిస్తారు. కొన్ని పరిస్థితుల్లో మందుల ద్వారానే 80 శాతం వరకూ ఈ వ్యాధి నయం అవుతుంది. కానీ కొందరిలో మాత్రం దీనికి ఏ విధమైన ఆస్కారం ఉండదు. వీళ్ళకు శస్త్ర చికిత్సతో పాటు మెదడులో రసాయన మార్పులు, ఆహారంలో మార్పులు అవసరం అవుతాయి.

పెద్ద వారి విషయంలో అనేక కారణాలు వల్ల మూర్చ వ్యాధి ఎదురౌతుంటే, ఈ సమస్యలేం లేకుండా జన్యు పరమైన కారణాలు, వ్యాధుల వల్ల పిల్లల్లో ఈ సమస్య వస్తోంది. పెద్ద వారితో పోలిస్తే పిల్లల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళడంతో పాటు… స్కూలుకెళ్ళే పిల్లలకు మూర్చ వ్యాధి ఉన్నప్పుడు అధిక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పిల్లలు మూర్చకు గురైనప్పుడు ఛాతీ, మెడ భాగంలో దుస్తులు వదులు చేయాలి. మూర్చ వచ్చే ముందు కడుపులో తిప్పడం, కళ్ళు తిరగడం, వాంతి వచ్చినట్లు ఉండడం లాంటి లక్షణాలు ఉంటాయి. పిల్లలకు మూర్చ లక్షణాలను ముందుగానే తెలియజేసి, ఆ సమయం వచ్చినప్పుడు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని తెలియజేయాలి. ప్రధానంగా ఇలాంటి విషయాల్లో వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా పిల్లలకు అంద జేస్తూ ఉండాలి. పెద్ద వారి విషయంలో కూడా ఇవే జాగ్రత్తలు వర్తించినప్పటికీ, చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటూ, సరైన చికిత్స అందిచడం ద్వారా మూర్చ వ్యాధిని అధిగమించడం సాధ్యం అవుతుంది.

Leave a Comment