Health Benefits : క్రాన్ బెర్రీలను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుతమైన ప్ర‌యోజ‌నాలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Health Benefits of Cranberries

క్రాన్ బెర్రీస్ .. బెర్రీ పండ్లలో ఇవి కూడా ఓ రకం. వీటి ద్వారా మనకు ఎన్నో పోషకాలు లభిస్తాయి. చూడడానికి చిన్నగా, ఎర్రగా అందంగా ఉంటాయి. వీటిని పండుగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు.. ఎండిన తర్వాత కూడా తీసుకునే అవకాశం ఉంది. ఐతే ఎండిన పండ్లలో కాస్తంత చక్కెర పాళ్లు ఎక్కువ. క్రాన్ బెర్రీ పండ్లు ఒక కప్పు తీసుకుంటే .. 46 క్యాలరీలు లభిస్తాయి. 4 గ్రాముల ఫైబర్, 4 గ్రాముల షుగర్ ఉంటుంది. 12 గ్రాముల వరకు పిండి పదార్థాలు శరీరానికి అందుతాయి. ఐతే ఎండిన పండ్లను తీసుకుంటే 92 Health Benefits of Cranberriesక్యాలరీలతోపాటు 25 గ్రాముల పిండిపదార్థాలు 2 గ్రాముల ఫైబర్, 22 గ్రాముల చక్కెర లభిస్తాయి. ముఖ్యంగా క్రాన్ బెర్రీ పండ్లను ఏ రూపంలో తీసుకున్నా జీరో ఫ్యాట్ ఉంటుంది.

క్రాన్ బెర్రీ పండ్ల నుంచి విటమిన్లు కూడా అధికంగా లభిస్తాయి. దీని ద్వారా రోజులో మనకు కావాల్సిన 25 శాతం C విటమిన్ ను పొందవచ్చు. అలాగే 9 శాతం విటమిన్ A, 6 శాతం విటమిన్ K తోపాటు 2 శాతం పొటాషియం లభిస్తుంది. యాంటీఆక్సిడెంట్స్ కూడా క్రాన్ బెర్రీ నుంచి పుష్కలంగా లభిస్తాయి. సాధారణంగా మనం తీసుకునే పండ్లు అన్నింటిలో కంటే 20 శాతం యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా లభించే పండ్లు క్రాన్ బెర్రీస్ అని పరిశోధనల్లో వెల్లడైంది. క్రాన్ బెర్రీస్ లో ఫెనొల్స్ అనే యాంటీఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లలో యాంథోసయనిన్స్ కూడా ఎక్కువే.. మూత్రాశయ నాళానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు రాకుండా క్రాన్ బెర్రీ ఉపయోగపడుతుంది.

మహిళలు, పిల్లలకు క్రాన్ బెర్రీస్ వల్ల మూత్రాశయ ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయని అద్యయనాల్లో వెల్లడైంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఇవి సహకరిస్తాయి. ముఖ్యంగా మాంసం తినే వారిలో , పాల ఉత్పత్తులు అధికంగా తీసుకునే వారి ప్రేవుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను క్రాన్ బెర్రీస్ అభివృద్ధి చేస్తాయి. బైల్ యాసిడ్స్ ను తగ్గించి పేగుల క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. నోటిలో చెడు ఆమ్లాలు ఉత్పత్తి కాకుండా కూడా క్రాన్ బెర్రీ పండ్లు ఉపయోగపడతాయి. క్రాన్ బెర్రీ పండ్లను తరచుగా తీసుకుంటే క్యావిటీస్, చిగుళ్ల వ్యాధులు రాకుండా ఉండడంతోపాటు నోటి క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చు.

Leave a Comment