Health Benefits with Dance: డ్యాన్స్ చేసి ఆరోగ్యవంతులు అవుతారా?

By manavaradhi.com

Published on:

Follow Us
Health Benefits with Dance

సంగీతం వినగానే చాలామందిలొ కాళ్లు, చేతులు వాటంతట అవే కదులుతుంటాయి. ఇష్టమైన పాటలను వింటూ వాటికి అనుగుణంగా కాసేపు డాన్స్ చేస్తే చాలు.. ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. అంతేకాదు 20 నిమిషాల పాటు డాన్స్ చేస్తే చాలు 100 నుంచి 120 కేలరీలు తగ్గించుకోవచ్చు. చెమట చిందించటం వల్ల కొవ్వు కూడా కరిగే అవకాశం ఉంది. డాన్స్ చేయడం వల్ల మానసిక ఆనందం కూడా లభిస్తుంది.

డాన్స్ థెరపీ అన్నదొక సరికొత్త ప్రయోగం. ఇందులో నదుల్ని కదిలించే నడక. ప్రశాంతత ఇచ్చే యోగా నాజూగ్గా తీర్చిదిద్దే ఏరోబిక్స్ కలిసి ఉంటాయి. అమెరికాలోని ప్రతి ఆస్పత్రికీ ఒక డాన్స్ థెరపిస్ట్ తప్పని సరిగా ఉంటారు. వీళ్ళు ఫిజియో థెరపిస్ట్ లతో అనుసంధానం అయి వుంటారు. కీళ్ల నొప్పులున్న పేషేంట్లకి ఈ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి మనసుకి ప్రశాంతత కూడా. ఈ డాన్స్ థెరపీ లో ఎండార్ఫిన్ హార్మోన్ రీలీజవుతుంది. ఒత్తిడి తగ్గి తేలిగ్గా ఉంటుంది. శరీరానికి సానుకూల దృక్పధం కలిగితే మంచి హార్మోన్లు విడుదల అవుతాయి. శరీరంలోని అవయవాలు కదిలించేలా చేసే ఈ డాన్స్ కొన్ని నీడల పైన కీళ్ల పైన పనిచేస్తుందని ఇదే ఒక అద్భుతమైన ఔషధం లాంటిదని వైద్యులు సిఫార్స్ చేసారు. శరీరానికి మనసుకీ ఆహ్లాదకర వ్యాయామం డాన్స్ థెరపీ. కొన్ని భంగిమలను స్థిరంగా నిలబెట్టటం ద్వారా ఆయా అవయవాలకు ఉత్తేజం కలుగుతోంది.

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో యూత్ విభిన్నంగా ఆలోచిస్తుంది. ప్రతీది వెరైటీగా ఉండాలని యువతీ యువకులు కోరుకుంటున్నారు. ధరించే వస్త్రాలు, ఫ్యాషన్ యాక్ససరీస్ తదితరాలే కాదు పబ్లలో చేసే డ్యాన్సులు సైతం వెరైటీగా ఉండాలని వారు తాపత్రయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బీట్ మ్యూజిక్ మధ్య హుషారుగా చేసే జుంబా నృత్యం పట్ల వీళ్లు ఎంతో ఆకర్షితులవుతున్నారు. ఉర్రూతలూగించే మ్యూజిక్ మధ్య యువతీ, యువకులు హుషారుగా కాళ్లు, చేతులు ఆడిస్తూ నృత్యాలు చేస్తున్నారు. ఏరోబిక్స్ను తలపించే విధంగా డ్యాన్సును యువ జంటలు ఉత్సాహంగా చేస్తూ ఆకట్టు కుంటున్నారు. ప్రతి దాంట్లో వెరైటీని కోరుకునే యువతీ,యువకులు జుంబా డ్యాన్స్ ప్రత్యేకంగా నేర్చుకొని పబ్ లలో జరిగే నైట్ పార్టీలలో వీటిని ప్రదర్శిస్తున్నారు.

మన దేశంలో జుంబా నృత్యానికి యువతలో మంచి క్రేజ్ ఉంది. కార్డియో బేస్డ్ వర్కవుట్లతో కూడిన ఈ నృత్యాన్ని ప్రాక్టీస్ చేస్తే శరీరంలో ఫ్యాట్ తగ్గుతుందని ఫిట్నెస్ నిపుణులు సైతం చెబుతుండడం విశేషం. జుంబా నృత్యం చేసేవారు ఏరోబిక్స్ డ్యాన్స్ షూస్, స్నీకర్స్ను ధరించాల్సి ఉంటుందని, ఈ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి ముందు తర్వాత మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దాంతో చెమట రావడం మూలంగా బాడీ హైడ్రేటెడ్ కాకుండా ఉంటుంది. డాన్స్ ఏరోబిక్స్ ను పోలిఉంటుంది. . అదే విధంగా ఎరోబిక్స్ ఎక్సర్ సైజ్ లా, ఇది పూర్తి శ్వాస తీసుకోవడానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల బరువు తగ్గుతారు. అంతే కాదు ఇది ఊపిరితిత్తుల పవర్ ను కూడా పెంచుతుంది. వయస్సు మీద పడనివ్వదు: డ్యాన్స్ బరువు సులభంగా తగ్గించడమే కాదు, శరీరంలో అన్ని అవయవాలు కదిలేలా చేస్తాయి. కండరాలు బలంగా ఉండేలా సహాయపడుతాయి. చాలా వరకూ అన్ని రకాల డ్యాన్సులు మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అలాగే వ్యాయామాలు చేయడం వల్ల కండరాలు బలపడతాయి. జుంబా, సాల్సా డ్యాన్సు ల వల్ల శరీరంలో ప్రతి పార్ట్ నుండి క్రొవ్వును కరిగిస్తాయి. ఈ డ్యాన్స్ నేర్చుకొని బరువు తగ్గించుకోవాలనుకొనే వారికి కొన్ని చిట్కాలు పాటించాలి. ఈ డ్యాన్స్ నేర్చుకోవాలనుకొనే వారు, ట్రైనర్ వద్దకు ఒంటరిగా వెళ్ళడం కంటే చాలా మంది ఉన్నప్పుడు వెళ్ళడం మంచిది..డ్యాన్స్ వ్యాయామం వంటిదే. కాబట్టి ఆరోగ్యపరంగా మీకేదైన సమస్య ఉన్నప్పుడు డ్యాన్స్ కు వెళ్ళడానికి ముందు డాక్టర్ ను సంప్రదించిన తర్వాత చేరండి. డ్యాన్స్ ను కనీసం 45నిముషాల తప్పనిసరిగా చేయాలి . అప్పుడు మంచి ఫలితం ఉంటుంది.

డాన్స్ చేయడం వల్ల కేవలం వినోదం మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తెచుకొవచు. ఇంట్లోనే ఉంటూ క్యాలరీలు తగ్గించుకోవచ్చు. డాన్స్ చేయడం వల్ల శారీరక శ్రమతో వ్యాయామం చేసినట్టవుతుంది. దీంతో మానసిక ప్రశాంతతో పాటు ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది.

Leave a Comment