హార్ట్ ఎటాక్. . ఈ సమస్య కచ్చితంగా భయపెట్టేదే. ఈ సమస్య రాకుండా చూసుకోవడం మన చేతుల్లో ఉంటుందా. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసినా . . ఒక్కోసారి మన ప్రమేయం లేకుండా ఈ సమస్య ఎదురు కావచ్చు. హార్ట్ స్ట్రోక్ కు కారణాలేంటి? ఏఏ పరిస్థితుల్లో దీన్ని మనం ఎదుర్కోవాల్సి రావచ్చు?
హార్ట్ స్ట్రోక్ సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. అందులో నిద్రలేమి కూడా ఓ కారణం. రోజూ పనిలో పడి చాలా మంది నిద్రను తగ్గించుకుంటున్నారు. శారీరకంగా శ్రమించినప్పుడు అలసట వస్తుంది. రోజుకు కనీసం 6 గంటలైనా కచ్చితంగా నిద్రపోవాలి. ఇంతకంటే తగ్గితే రక్తపోటు పెరిగి.. హార్ట్ స్ట్రోక్ కు దారితీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. తరచుగా తలనొప్పి వస్తుంటే తేలిగ్గా తీసుకోవద్దు. భవిష్యత్ లో హార్ట్ సమస్యలు వచ్చేందుకు ఇది సంకేతమంటున్నారు వైద్యులు. తలనొప్పి వచ్చే ముందు కళ్లు మసకగా కనిపించడం, ఏ చిన్న శబ్ధం విన్నా చిరాగ్గా అనిపించడం వంటి లక్షణాలు ఉంటే భవిష్యత్ లో గుండెపోటు రావచ్చని హెచ్చరిస్తున్నారు.
చల్లటి వాతావరణం ఉన్నప్పుడు గుండె కవాటాలు సంకోచిస్తాయి. దీంతో గుండెకు రక్తప్రసరణ కష్టమవుతుంది. ఈ సమయంలోనూ హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. శ్వాసకోస సంబంధిత ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి కూడా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా ఆస్తమా వ్యాధి ఉన్నవారికి గుండె పోటు వచ్చే ప్రమాదం 70 శాతం ఉంటుందంటున్నారు వైద్యులు. ఇన్హేలర్ వాడే వారిలోనూ ప్రమాదం పొంచే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు గాలిలో కాలుష్యం కూడా కారణమవుతుందంటున్నారు పరిశోధకులు. గాలి కాలుష్యం వల్ల గుండె కవాటాలు దెబ్బతిని స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు…
ఆహారం కొద్ది..కొద్దిగానే తీసుకోవాలి. ఎప్పుడూ కడుపు నిండా భోజనం చేయకూడదు. ఒక్కసారి కడుపు నిండా తిన్నా .. గుండె సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. కడుపు నిండా తినడం వల్ల శరీరంలో స్ట్రెస్ హార్మోన్ అధిక స్థాయికి చేరుకుంటుందట.. ఇది రక్త పీడనాన్ని పెంచేస్తుంది .. ఫలితంగా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ..కోపం, ఉద్రేకం, బాధ, ఒత్తిడి.. ఇలాంటివి గుండె సమస్యలకు కారణమవుతుందని అందరికీ తెలుసు. ఐతే పట్టరాని సంతోషం కూడా ఒక్కోసారి గుండె సమస్యలను తెచ్చిపెడుతుందంటున్నారు వైద్యులు. కాబట్టి ఇలాంటి ఎమోషన్ కలిగించే వార్తలు విన్నప్పుడు లేదా చూసినప్పుడు .. చాలా జాగ్రత్తగా ప్రతిస్పందించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉదయం లేచేటప్పుడు.. ఠక్కున లేచి కూర్చోవద్దు. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రంతా గాఢ నిద్ర తర్వాత .. ఉదయం మెలకువ వచ్చేందుకు శరీరంలో కొన్ని స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి గుండెపై ఒత్తిడి తీసుకొస్తాయి. కాబట్టి.. నిద్రలేచిన వెంటనే పడక మీద నుంచి లేవకుండా కాసేపు అలానే కూర్చోవాలని సూచిస్తున్నారు వైద్యులు. .
గుండె చక్కగా పనిచేయాలంటే .. అది మన చేతుల్లోనే ఉంది. వయసురీత్యా గుండె పనితీరు కాస్త మందగిస్తుంది. ఐతే దాన్ని మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల ద్వారా సరిచేసుకోవడం చాలా ముఖ్యం. రోజూ తప్పనిసరిగా కాసేపు వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. మానసికంగా ప్రశాంతంగా గడపడం చాలా ముఖ్యం. ఇవన్నీ పాటిస్తే .. హార్ట్ ఎటాక్ సమస్య నుంచి కాపాడుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.