Health Tips – మనకు ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

By manavaradhi.com

Published on:

Follow Us
Infectious diseases - Symptoms & causes

సూక్ష్మజీవుల వలన శరీరానికి హాని కలిగించ‌డాన్నే ఇన్ఫెక్షన్‌ అంటాం. సూక్ష్మజీవులు శరీరంలో చేరి వృద్ధి చెంది వ్యాధుల్ని కల్గించడం వల్ల వీటిని పాథోజెన్స్‌ అంటారు. ఇది శరీరంలోని ఏ భాగానికైనా లేదా శరీరమంతట రావచ్చు. దీనికి వయోభేదం, స్త్రీ, పురుష భేదం లేదు. మనుష్యులు జంతువుల శరీరంపైగానీ దుస్తులపైగానీ చేరి వృద్ధి చెంది పునరుత్పత్తి అయ్యే చిన్న క్రిములను ఇన్‌ఫెస్టేషన్‌ అంటారు.

ప్రపంచంలో ఇన్ఫెక్షన్‌తో బాధ పడని జీవి అంటూ ఏదీ లేదు. ఇన్‌ఫెక్ష‌న్లు సాధార‌ణంగా చ‌ర్మం ద్వారా, సెక్స్ ద్వారా, ద‌గ్గులు, తుమ్ముల ద్వారా తుంప‌ర్లు ప‌డి వ్యాప్తిచెందుతాయి. ఒక‌రు వాడిన ఇంజెక్ష‌న్ల‌ను మ‌రొక‌రు వాడ‌టం వ‌ల్ల‌ ర‌క్తం ద్వారా కూడా ఇన్ఫెక్ష‌న్లు వ్యాపిస్తాయి. అలాగే కాలుష్య‌పూరిత ఆహారంగానీ, నీరుగానీ తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి.

ఇన్ఫెక్షన్‌ అనేది ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకే ఇన్ఫెక్షన్‌ ఒక ఇంట్లో వున్న నలుగురు కుటుంబ సభ్యులకు వచ్చినపుడు వ్యాధి లక్షణాలు అందరిలో ఒకేలా వుండవు. అందరికి ఇన్ఫెక్షన్‌ వల్ల వ్యాధి రావాలని లేదు. వ్యాధి స్వరూపం అనేది రోగిలోని వయస్సు, ప్రతి స్పందనను బట్టి వుంటుంది. ఒక్కొక్క వ్యాధిలో ఇన్ఫెక్షన్‌ ఒక్కొక్క విధంగా వుంటుంది. ఇది వ్యాధి క్రిముల సంఖ్య, వ్యాప్తి, తీవ్రత, రోగనిరోధక శక్తిని బట్టి వుంటుంది. క్లినిక‌ల్ ఇన్ఫెక్ష‌న్లు గుప్తంగా వుండి దీర్ఘకాలిక వ్యాధులుగా పరిణమించే అవకాశం వుంటుంది.

ఇక సైలెంట్ ఇన్ఫెక్ష‌న్లు అంటే ఇన్ఫెక్షన్‌ వున్న శరీరంలో ఎటువంటి లక్షణాలు కన్పించవు. సూక్ష్మ‌క్రిములు శ‌రీరంలోకి రాకుండా చ‌ర్మం అడ్డుకుంటుంది. అలాంటి చ‌ర్మంపై గాట్లుగానీ, కోత‌గానీ ప‌డిన‌ప్పుడు ఈజీగా సూక్ష్మ‌జీవులు శ‌రీరంలోనికి ప్ర‌వేశించి వ్యాధులు వ్యాపింప‌జేస్తాయి. చెమ‌ట‌, కంటినీరు, ముక్కులోని మ్యూక‌స్ సూక్ష్మ‌క్రిముల‌ను అడ్డుకోవ‌డ‌మే కాకుండా వాటిని నాశ‌నం చేసేందుకు ఎంజైమ్‌ల‌ను విడుద‌ల చేస్తాయి.

శ‌రీరంలోని చ‌నిపోయిన క‌ణాల‌ను, ఇత‌ర సూక్ష్మ‌క్రిముల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో కీల‌కంగా ప‌నిచేసే లింఫాటిక్ వ్య‌వ‌స్థ‌లో లోపం వ‌ల్ల లింఫ్ గ్రంథుల్లో చేరి ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. యాంటిజెన్స్.. రోగనిరోధక వ్యవస్థ గుర్తించగల మార్కర్స్. ఇత‌ర క‌ణాలు దాడిచేసిన‌ప్పుడు వాటి నుంచి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి. వ్యాధి మాటిమాటికి తిరగబడుతున్న దీర్ఘవ్యాధిగా పరిగణమిస్తున్నా, హఠాత్తుగా ప్రాణాపాయస్ధితి ఏర్పడడానికి మూలకారణం లాటెంట్‌ ఇన్ఫెక్షన్‌.

ఇన్ఫెక్షన్‌ వల్ల వ్యాధిని సూక్ష్మజీవులు కల్గించక చాలా కాలం పాటు శరీరంలోనే వుండిపోయి ఇన్ఫెక్షన్‌ రిజర్వాయర్‌గా పనిచేయడం వల్లనే ఇది జరుగుతుంది. ఎముక మూలుగ నుంచి పుట్టే తెల్ల‌ర‌క్త‌క‌ణాలు స‌రిగా ప‌నిచేయ‌న‌ప్పుడు.. క్యాన్స‌ర్ వంటి అసాధార‌ణ క‌ణాలు పెరిగిన‌ప్పుడు తెల్ల‌ర‌క్త‌క‌ణాల‌ను నాశ‌నం చేయ‌డం వ‌ల్ల.. ర‌క్తంలోని టీ సెల్స్‌, బాసోఫిల్స్‌, చ‌ర్మంలో ఉండే మాస్ట్ సెల్స్ న‌శించ‌డం ద్వారా, శ‌రీరంలోని ప్ర‌తినిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నిచేయ‌కుండా పోయిన‌ప్పుడు ఇన్ఫెక్ష‌న్లు వ్యాప్తిచెందుతాయి.

అంటువ్యాధులు సోకిన రోగుల విషయంలో పతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు సోకిన వ్యక్తులు వాడిన వస్తువులు మరొకరు వాడకూడదు. అలాగే చేతుల శుభ్రత కోసం హ్యాండ్‌ శానిటైజర్‌ వాడాలి. వైద్యుల సలహా మేరకు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉంటాయి.

Leave a Comment