Knee surgery – మోకీలు మార్పిడి ఎవరికి చేస్తారు? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

By manavaradhi.com

Published on:

Follow Us
Knee surgery

నేడు మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది అతి చిన్న వయసులోనే కీళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి లక్ష మంది బాధితుల్లో దాదాపు 2 వేల మంది మోకీలు, తుంటి సమస్యలతో బాధపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మోకీలు మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. మోకాళ్ల నొప్పులతో వచ్చేవారిలో 80 శాతం మందులతో నయం చేయవచ్చని, 20 శాతం మాత్రమే మార్పిడికి ఆస్కారముంటుందని చెబుతున్నారు వైద్యులు. అసలు మోకీలు మార్పిడి ఎవరికి చేస్తారు? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రస్తుత కాలంలో 60 ఏళ్ల వయసుదాటిన వారికి రావాల్సిన మోకాళ్ళ నొప్పులు 30 ఏళ్లకే వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, పౌష్టికాహార లోపం, వ్యాయామం లేకపోవడం, విటమిన్‌ డి లోపం లాంటివి ఇందుకు కారణమవుతున్నాయి. అధిక బరువు ఉన్నవారు తరచూ కింద కూర్చోవడం, లేవడం, మెట్లు ఎక్కడం, దేశీయ మరుగుదొడ్లను వినియోగించడం వల్ల ఈ సమస్య మరింతగా పెరుగుతోంది. కార్టిలేజ్ అరుగుదల వల్ల ఎముకలు పెళుసై విరిగిపోవడం, తరచూ నడుము, మణికట్టు, తుంటి వద్ద ఫ్రాక్చర్స్‌ అవుతుంటాయి. ఇలా ఆర్థరైటిస్‌ సమస్యలతో వైద్యుల వద్దకు వచ్చే వారిలో సగం మంది మోకీలు బాధితులే! మిగిలిన వారిలో 20 % తుంటి, 10 % భుజం నొప్పులు, 20% ఎల్బో, చేతి జాయింట్లు, చీలమండ తదితర నొప్పులు ఉంటున్నాయి. ఎక్కువ శాతం మందికి మందులు, ఇంజెక్షన్లతో సరిపెడుతున్నామని, కొందరికి తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు.

ఎముకల అరుగుదల నాలుగు దశల్లో ఉంటుందని .. మొదటి దశలో జాయింట్ల వద్ద ఉన్న కార్టిలేజ్‌లో అప్పుడప్పుడే అరుగుదల మొదలవుతుంది. తొలి దశలో గుర్తిస్తే దీనిని కొన్ని వ్యాయామాలు, యోగ వంటి ప్రక్రియల ద్వారా తగ్గించవచ్చు. రెండో దశలో కార్టిలేజ్‌ పెచ్చులూడినట్లు మారుతుంది. ఈ దశలో కొన్ని రకాల మందులు ఇచ్చి తగ్గిస్తారు. మూడో దశలో కార్టిలేజ్‌ గుంతలు పడినట్లు మారుతుంది. ఈ దశలో ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి నయం చేయడానికి ప్రయత్నిస్తారు. నాలుగో దశకు చేరితే శస్త్ర చికిత్స చేయడమే చివరి మార్గం.

వృద్ధుల్లో ఆర్థరైటిస్ వల్ల మోకాలి చిప్ప పూర్తిగా అరిగిపోతే వాళ్లకు మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స అవసరమవుతుంది. యుక్త వ‌య‌సులో ఉన్న‌వారికి ఈ శస్త్రచికిత్స అంత మంచిది కాదు. ఒరిజినల్ మోకాలి చిప్పను మార్చకుండానే కొన్ని మామూలు చికిత్సల తర్వాత మీలో నొప్పికి ఉపశమనం కలిగించలేనప్పుడు మాత్రమే చివరి ప్రయత్నంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయాలి. టోటల్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీలకు ప్రత్యామ్నాయంగా ఆస్టెటోమైస్ వంటి శస్త్రచికిత్సలు ఉన్నాయి. వీటివల్ల మరో పది, పదిహేనేళ్ల వరకు ఉపశమనం ఉంటుంది. కాబట్టి ముందుగా అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులను సంప్రదించాలి.

ప్రతి లక్ష మంది బాధితుల్లో 2 వేల మందికి తప్పనిసరిగా మోకీలు, తుంటి మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. మోకాళ్ల నొప్పులతో వచ్చేవారిలో 80 శాతం మందులతో నయం చేయవచ్చని, 20 శాతం మాత్రమే మార్పిడికి ఆస్కారముంటుంది. అలాగే కింద కూర్చుని పని చేయడం, భోజనం చేయడం, ఎక్కువసార్లు మెట్లడం లాంటి సమస్యలు పెరిగే అవకాశాలున్నాయి. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లో కనిపిస్తోంది. కాబట్టి మోకీలు మార్పిడి చేసుకోవాలనుకునేవారు సమీపంలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ ను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు ఆరోగ్యమే మహా భాగ్యం అవుతుంది.

Leave a Comment