Back Pain – బ్యాక్ పెయిన్ ఉన్నపుడు ప్రయాణం చేయాల్సొస్తే ?

By manavaradhi.com

Updated on:

Follow Us
Back Pain

ఇటీవలి కాలంలో నడుమునొప్పి, వెన్నునొప్పి లాంటి వాటికి చిన్నా పెద్దా వయసు తేడా లేకుండా పోయింది. ఈ సమస్య వల్ల తలెత్తే బాధను మాటల్లో వివరించడం సాధ్యం కాదేమో. చాలా మందికి కొన్ని పనుల వలన వెన్ను నొప్పి సమస్య ఎదురవుతుంది. చిన్నపాటి పనుల వలన కూడా సడెన్ గా వెన్నునొప్పి సమస్య ప్రారంభమవుతుంది. వెన్నునొప్పి విషయంలో చాలామంది చేసే కంప్లైంట్ ఏంటంటే ప్రయాణాల్లో ఎక్కుగా వేదిస్తుంది.

ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల జీవితమే. ఆధునికత పెరుగుతున్న కొద్దీ .. కాలం స్పీడుగా పరుగెడుతోంది.. దానికి తగ్గట్టూ మనమూ వేగంగా పరుగు పెట్టాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇళ్లు, ఆఫీసు, వ్యాపారాలు .. ఇలా ప్రతి ఒక్కరిపై పని భారం పెరుగుతూనే ఉంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివధ పనుల ఒత్తిడిలో శరీరం నలిగిపోతోంది. శరీరంపై విపరీతంగా ఒత్తిడి పడడంతో నొప్పులు తప్పడం లేదు. ముఖ్యంగా అన్నింటి కంటే నడుముపైనే ఎక్కువగా భారం పడుతుంది. దీంతో నడుం నొప్పితో ఇబ్బంది పడని వారు చాలా అరుదనే చెప్పాలి.
నడుం నొప్పిని చిటికెలో నివారించేందుకు ఎలాంటి మార్గాలు లేవు. కచ్చితంగా వెన్నుపూస, నడుం కండరాలను దృఢంగా ఉండేలా చేసుకోవడం ఒక్కటే మార్గం . కాబట్టి .. వాటి బలోపేతానికి ఫిజియోథెరపిస్టులు లేదా వ్యాయామ నిపుణులు చేసిన సూచనలు పాటించుకుంటే మంచిది… వెన్ను నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు నడుము భాగం మీద వేడినీటితో కాపడం పెట్టడం లేదా ఐస్ బ్యాగ్ పెట్టడం చేయాలి.

చాలా దూరం.. కారు డ్రైవింగ్ చేసినప్పుడూ నడుంపై తీవ్రంగా ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నడుం నొప్పి బాధించే అవకాశం ఉంది. బైక్ డ్రైవ్ చేసినప్పుడు నడుమును నిటారుగా ఉంచాలి. అలా కాకుండా ముందుకు లేదా వెనక్కి ఉండేలా వంచకూడదు. ఇక కారు డ్రైవ్ చేసినప్పుడు నడుము వెనుక దిండు పెట్టుకోవాలి. కారులోకి ప్రవేశించినప్పుడు, సౌకర్యవంతంగా ఉండటానికి వెనుక జేబులను ఖాళీ చేయండి. సీటును సర్దుబాటు చేయండి, తద్వారా మీరు నిటారుగా కూర్చోవచ్చు, కొంచెం వాలుగా ఉండి, సీట్‌బెల్ట్ సరిగ్గా సరిపోతుందని నిర్ధారించుకోండి. వీపుకి సపోర్ట్ ఇచ్చేలా సీటుని స్టీరింగ్ దగ్గరకు జరుపుకోవాలి. సీటు, స్టీరింగ్‌కి మధ్య మోకాళ్లు వంచటానికి.. బ్రేక్, క్లచ్‌లకు పాదాలు సరిగా తాకటానికి అవసరమైనంత దూరం ఉండేలా చూడాలి. అదే విధంగా.. ఎక్కువసేపు డ్రైవ్ చేయాలసి వస్తే.. మధ్యమధ్యలో కాసేపు విరామం తీసుకుంటూ డ్రైవ్ చేయాలి.

నడుము నొప్పి అనేది ప్రతిరోజూ పని చేయడానికి లేదా జీవనోపాధి కోసం ఎక్కువ దూరం ప్రయాణించే వ్యక్తుల్లో సాధారణంగా కనిపంచే సమస్య. ఒక అధ్యయనం ప్రకారం, అధిక వైబ్రేషన్ స్థాయిలకు గురైన వ్యక్తులు, రోడ్డుపై గంటలు గడపడం వల్ల, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నడుము నొప్పికి గురయ్యే ప్రమాదం చాలా ఎక్కువ. మీ చుట్టూ ఉన్న కార్లను చూడటానికి మీరు నిరంతరం తల తిప్పాల్సిన అవసరం లేకుండా మీ కారు అద్దాలన్నింటినీ సరి చేయండి. ట్రాఫిక్‌ను పర్యవేక్షించడానికి కళ్లను మాత్రమే కదిలించే విధంగా వాటిని సర్దుబాటు చేయాలి. వైబ్రేషన్‌లను తగ్గించడానికి కారును మంచి స్థితిలో ఉంచండి. రెగ్యులర్ సర్వీసింగ్‌ను పూర్తి చేయండి, పాత టైర్‌లను వెంటనే మార్చండి మరియు మీకు మంచి షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇది ముఖ్యంగా ఎగుడుదిగుడుగా ఉన్న రోడ్లపై డ్రైవింగ్ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాదు మీ వెనుక వీపుకు ఉపశమనాన్ని అందిస్తుంది.

జీవనశైలిలో యోగాను చేర్చుకోండి. సుదీర్ఘ ప్రయాణం తర్వాత దీర్ఘకాలిక వెన్నునొప్పికి యోగా సరైన దీర్ఘకాలిక పరిష్కారం. రెగ్యులర్ వ్యాయామం కండరాలను సడలించడమే కాకుండా వాటిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది, సమస్యను తీవ్రంగా తగ్గిస్తుంది.డ్రైవింగ్ కారణంగా వెన్నునొప్పి ఇంకా కొనసాగితే, డాక్టర్ నుండి సలహా తీసుకోండి. ఇది మరింత తీవ్రమైనదానికి సంకేతం కావచ్చు. చిన్నపాటి కదలికతో కూడా పునరావృతమయ్యే వెన్నునొప్పి, రాత్రిపూట జ్వరం,నొప్పి, బరువు తగ్గడం మరియు కాళ్లలో బలహీనత, తిమ్మిరి లేదా జలదరింపు వంటి లక్షణాలు అప్రమత్తంగా ఉండాలి.

ఫ్లెక్సిబిలిటీ తక్కువగా ఉన్నప్పుడు కూడా వెన్నునొప్పి సమస్య తలెత్తుతుంది. ఫ్లెక్సిబిలిటీను పెంపొందించడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలపై అంటే తల నుంచి పాదాల దాకా సమాన బరువు పడుతుంది. దాంతో, ఒకే భాగంపై ఒత్తిడి పడటం తగ్గుతుంది.

Leave a Comment