Typhoid : టైఫాయిడ్‌తో జాగ్రత్త! టైఫాయిడ్‌ జ్వరం వస్తే ఏవి తినాలి? ఏవి తినకూడదో..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Tips to avoid Typhoid

వర్షాకాలంలో టైఫాయిడ్‌ జ్వరం కూడా ఎక్కువగానే ఉంటుంది. కలుషిత ఆహారం, నీటి ప్రభావంవల్ల ఇనఫెక్షన సోకి జ్వరం వస్తుంది. పారిశుధ్ధ్య వసతులు సరిగా లేని చోట ఇది చాలా ఎక్కువగాద వ్యాప్తి చెందుతుంది. మురికివాడల్లో, చెత్త నిండిన నివాస ప్రాంతాల్లో టైఫాయిడ్‌ చాలా ఎక్కువగా బాధిస్తోంది. ముఖ్యంగా వర్షాకాలం టైఫాయిడ్ కు అనువైన సమయం , ఇది అంటువ్యాధి. కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా కూడా టైఫాయిడ్ వ్యాప్తి చెందుతుంది.

టైఫాయిడ్ .. అన్ని జ్వరాల్లోకెల్ల ప్రమాదకరమైనది. ఇది సాల్మొనెల్లా టైఫీ’ అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమిస్తుంది. ఈగలు, కలుషిత ఆహారం, కలుషిత నీరు ఈ వ్యాధికి వాహకాలుగా పనిచేయడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది ఎక్కువగా వర్షాకాలంలో వచ్చే వ్యాధి. మనం తినే ఆహారం కలుషితమైనపుడు ఇది టైఫాయిడ్ వస్తుంది. మల,మూత్రవిసర్జనకు వెళ్ళినపుడు చేతులను శుభ్రంగా కడుక్కోకుండా అదే చేతుల్తో ఆహారాన్ని తింటే టైఫాయిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యాధిని ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాలుపోయే ప్రమాదం ఉంది.

టైఫాయిడ్‌ సోకిన మొదటివారంలో రోగికి తలనొప్పి, మందకొడిగా ఉండటం, నీరసం, తెలియని నొప్పులు, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మూడో రోజు నుంచి లక్షణాలు తీవ్రమైన కడుపు నొప్పి, దగ్గు , మలబద్దకం లాంటి సమస్యలు వస్తాయి. జ్వరం 102 -104 డిగ్రీల వరకు పెరుగుతూ , తగ్గుతూ ఉంటుంది. నాలుక పొడిగా ఉంటుంది. నాడి వేగంగా కొట్టుకుంటుంది.

జ్వరంతో ప్రారంభమయ్యే టైఫాయిడ్ రోజురోజుకీ పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. ఈ వ్యాధి క్రిముల్ని సకాలంలో నిరోధించకపోతే వ్యాధి ముదిరి న్యుమోనియా, గుండె బలహీనపడటం, పేగుల్లోంచి రక్తస్రావం లాంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ జబ్బు పట్ల ఏమాత్రం అశ్రద్ధ చూపవద్ధు. రోగికి టైఫాయిడ్ సోకిన వెంటనే వైద్య చికిత్స తప్పనిసరి. ముందుగా వైద్యులు రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తారు. తర్వాత వైడల్ టెస్ట్ చేస్తారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత రొగులు వైద్యులు ఇచ్చే మందుల్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి. టైఫాయిడ్ అడ్డుకొనుటకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సిఫారసు చేసిన రెండు టీకాలు ప్రస్తుతం ఉన్నాయి. నోటి ద్వారా తీసుకునే , సూది ద్వారా ఎక్కించే వాక్సిన్ లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండూ 50 నుండి 80% రక్షణను ఇస్తాయి.

టైఫాయిడ్ జ్వరం తీసుకోవాలిసిన జాగ్రత్తలు..?

కలుషిత నీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.నీళ్లను కాచి వడపోసి తాగాలి. కనీసం వానాకాలం పూర్తయ్యే వరకైనా ఇలా చేయడం ఉత్తమం.ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఏ పూటకాపూటే వండుకొని తినాలి. నిల్వ చేసిన పదార్థాలను తీసుకోకపోవడం మేలు. వీధుల్లో విక్రయించే ఆహార పదార్ధాలను తీసుకోవద్దు. ఇవి కలుషితం కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది.ఏదైనా ఆహారం తినే ముందు, తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. ఇళ్ల పరిసరాల్లోనూ చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే టైఫాయిడ్ వ్యాధికి దూరంగా ఉండవచ్చు.

వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు అధికంగా వస్తుంటాయి. టైఫాయిడ్‌ వచ్చిన వారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముందు జాగ్రత్తగా పిల్లలకు చిన్నతనంలోనే టీకా వేయించాలి. టైఫాయిడ్‌ వచ్చిన వారు అప్పటికప్పుడు వండిన ఆహారపదార్థాలు మాత్రమే తినాలి. బయటి ఆహారం తినకూడదు.

Leave a Comment