మనం పీల్చేగాలికి అ ను గుణంగా సాగి, మన శరీరానికి ఆక్సిజన్ ను అందిస్తుంటాయి ఊపిరితిత్తులు. సాగే గుణం అనేది ఊపిరితిత్తులకు సహజంగా ఉంటుంది. మరి అలాంటి సహజసిద్దమైన సాగే గుణాన్ని ఊపిరితిత్తులు కోల్పోవడాన్నే “ఇంటస్టీషియల్ లంగ్ డిసీజ్”(ILD) అంటారు. దీనినే “ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్” అని కూడా అంటారు. ఇది వచ్చిన వారికి రక్తంలోని ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఈ వ్యాధి రావడం వలన నిత్యం మనం ఎదుర్కునే ఆటంకాలు ఏంటి..?
మనం అనారోగ్యానికి గురికావడానికి కారణాలు అనేకం. కొన్ని,కొన్ని సార్లు మనకు ఏవైనా వ్యాధిలు వచ్చినా వాటికి సంబంధించిన లక్షణాలు మనకు కనిపించినా, వాటిని గుర్తించలేకపోతుంటాము. ఒకవేళ గుర్తించినా, అవే తగ్గిపోతాయిలే అని నిర్లక్షం చేస్తుంటాము. ఇలా చేయడం వలన మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి మనమే హానిని కలిగిస్తుంటాము.
ఊపిరితిత్తుల ఫైబ్రొసిస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి.
1 పుట్టుకతో వచ్చే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్
2 ఆటో ఇమ్యున్ డిసీజెస్
పుట్టుకతో వచ్చే ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ను “ఇడియో పథిక్ ఫైబ్రోసిస్” అంటారు. ఇది రావడానికి కారణాలు ఏమి ఉండవు. కాకపోతే ఇది వంశపారంపర్యంగా వస్తుంది. ఈ వ్యాధి అనేది యుక్త వయస్సులో కూడా వస్తుంది. ఇది వచ్చిన వారిలో ఆయాసం దగ్గు వస్తుంటాయి. దీనిని నిర్లక్షం చేయకుండా డాక్టర్గారి సలహాలను తీసుకొని వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి. లేకపోతే ఈవ్యధి ముదుఇరితే మన గుండె పైన ప్రభావం చుపుతుంది. ఇంక రెండవ రకాన్ని కనుక పరిశీలించినట్లైతే , ఈ వ్యాధి వస్తే మన రోగనొరోధక శక్తి పైన హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఎక్కువగా సోరియాసిస్, రుమటాయిడ్, అర్ధరైటిస్ మొదలైన చర్మ సంబంద వ్యాధులున్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాదులున్న వారిలో ఆ వ్యాధి లక్షణాలు చివరి దశకు చేరుకునే దశలో ఊపిరితిత్తులు అనేవి సాగే గుణాన్ని కోల్పోయి, గట్టిగా మారిపోతాయి.
ఊపిరితిత్తులకు సంబంధించిన ఈ ఫైబ్రోసిస్ వ్యాధి లక్షణాలు అనేవి సాధారణంగా రోజు జీవితంలో ఎదురయ్యే చిన్న, చిన్న అనారోగ్య సమస్యల లో ముడిపడిఉంటాయి. కాబట్టి, దీనిని త్వరగా గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి సమస్య అనేది ఎక్కువగా మద్య వయస్కులు , వృద్దులలో వచ్చినా, నేటి కాలంలో అన్ని వయస్సుల వారిని ఇది పలకరిస్తుంది. అందుకే తగిన జాగ్రత్తలు పాటిస్తూ , వీటి లక్షణాలను గమనిస్తుండాలి.
1 ఈ వ్యాధి లక్షణాలలో మొదటగా కనిపించేది దగ్గు
2 ఈ దగ్గు అనేది పొడి దగ్గు రూపంలో వస్తుంది.
3 కొంచెం శారీరక శ్రమ చేసినా ఆయాసం వస్తుంది.
4 రాత్రి వేళలో కంటే పగలు పనిచేస్తున్న సమయంలో ఆయాసం ఎక్కువగా రావడం ఈ వ్యాధి యొక్క ప్రత్యేకత.
5 కాళ్లల్లో వాపు , నిద్ర లేమి, నీరసం, కడుపునొప్పి వస్తాయి.
ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ గారి దగ్గరికి పోయి, వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి. లేకపోతే రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోయి ,కార్బన్ దై ఆక్సైడ్ పాళ్లు పెరిగి, మెదడు పై దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో మత్తుగా ఉండడం, కొన్నిసార్లు ఫిట్స్ రావడం, గురక పెరగడం, బి .పి లో హెచ్చు తగ్గులు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
మన ఆరోగ్యానికి ఇంతంటి హానిని కలిగించే వ్యాధులను చూసి భయపడాల్సిన అవసరం లేదు . ఎందుకంటే ఎన్ని రకాల కొత్త వ్యాధులు వచ్చినా , వెంటనే వాటికి సంబందించిన మందులను కనుగొనడంలో ఎంతో ముందున్నారు మన వైద్యులు. కాని, మనం మాత్రం చేయాల్సిన పని ఒక్కటే, మన శరేర అవయవాలకు సంబందించి ఏ చిన్న అనారోగ్య సమస్య కనిపించినా వెంటనే డాక్టర్ గారిని కలిసి వ్యాధి నిర్ధారణ చేసుకోవడం. ఈ ఊపిరితిత్తులకు సంబందించిన ఫైబ్రోసిస్ అనే వ్యాధిని ఎక్ష్ రే{x-ray} పరీక్షలో గుర్తిస్తారు.
ఈ ఎక్ష్ రే{x-ray} పరీక్ష చేసినపుడు ఊపిరితిత్తులలో చిన్న చిన్న కంణుతులు కనిపిస్తే ఇతర పరీక్షలను చేసి వ్యాధిని నిర్ధారిస్తారు. ఈ వ్యాధి ఉందని నిర్ధారించిన తర్వాత ఆ వ్యాధి యొక్క తీవ్రతను తెలుసుకోవడానికి టు డి ఎకో, ఆర్టీఫిషియల్ బ్లడ్ గ్యాస్ అనే పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షల వలన ఈ వ్యాధి వచ్చిన వారి రక్తంలో ఆక్సిజన్, కార్బన్- డై- ఆక్సైడ్ పాళ్లు ఎంత ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వ్యాధులను పూర్తిగా నయం చేసే మందులు లేకపోయినా, డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్సను తీసుకోవడం వలన వీరి జీవిత కాలాన్ని చాలా వరకు పొడిగించుకోవచ్చు. ఈ చికిత్సలో ముఖ్యంగా స్టెరాయిడ్స్ వాడతారు. కాబట్టి వీటి వలన శరీరంలోని ఇతర అవయాలపైన వీటి ప్రభావం పడకుండా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉంటే వాటి మోతాదును వారు నిర్ధారిస్తారు. ఈ వ్యాధి వచ్చిన వారికి చికిత్సలో భాగంగా ఆక్సిజన్ ను కూడా ఒక మందులా ఉపయోగిస్తున్నారు. ఈ ఆక్సిజన్ థెరపి తో మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. దీనిద్వారా వ్యాధిని నిర్ధారించిన వెంటనే ఆక్సిజన్ ను ఇవ్వడం ద్వారా ఊపిరితిత్తుల మీద శ్రమ తగ్గిపోయి మందులకు ఊపిరితిత్తులు త్వరగా రెస్పాండ్ అవుతాయి. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచడం ఈ ట్రీట్మెంట్ ముఖ్య ఉద్దేశం.
ఈ ఊపిరితిత్తులకు సంబందించిన ఈ వ్యాధికి తగిన మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వ్యాధి వస్తుందని భయపడిపోకుండా తగిన జాగ్రత్తలు చికిత్సలు తీసుకుంటే శరీరారోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలాంటి వ్యాధులు ఉన్నవారు ఆపొహలు తొలగించుకొని సరైన పద్దతిలో సరైనా సమయంలో చికిత్సలు చేయించుకోవాలి.