Health Tips : రోజు ఉదయం నిద్రలేవగానే హుషారుగా ఉండాలంటే?

By manavaradhi.com

Published on:

Follow Us
Sleep Tips for a Cold or the Flu

ఉదయం నిద్రలేచిన తరువాత వీలైనంత త్వరగా స్నానం చేయాలి. ఇది శరీరంలోని ఉష్ణోగ్రతస్థాయులను సమన్వయం చేస్తుంది. మెదడును ఉత్సాహపరిచి, చురుగ్గా మారుస్తుంది. శరీరంలో రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. గోరువెచ్చని నీటిని ఎంచుకుంటే మరీ మంచిది. ఇదో వ్యాయామంలా పని చేస్తుంది.

దినచర్య ఉత్సాహంగా మార్చడంలో వ్యాయామం పాత్ర కూడా కీలకమే. ఉదయాన్నే మేల్కోవడం వల్ల ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అలవడుతుంది. నిద్ర లేచిన తర్వాత వ్యాయామం చేయడం మీ అలవాట్లో లేకపోతే, ఆ అలవాటును అలవరుచుకోండి. పొద్దున్నే కనీసం అరగంటసేపు వ్యాయామం చేయడం వల్ల కూడా బద్ధకం వదిలి శరీరం ఉత్సాహంగా మారుతుంది.

రిలాక్సేషన్‌ కోసం నిద్రలేవగానే చాలా మంది టీ లేదా కాఫీ తాగుతారు. వీటికన్నా నిమ్మకాయ నీళ్లు లేదా మంచినీళ్లు తాగితే మంచిది. పండ్లలో ఉండే న్యూట్రీషిన్స్‌, ప్రోటీన్స్‌ వ్యాధి నిరోధకతను పెంచి, శరీరాన్ని స్ట్రాంగ్‌ అండ్‌ ఫిట్‌ గా ఉంచుతాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి.

ప్రతీ రోజు నిద్రలేచే సమయం కన్నా మరో గంట ముందుగా నిద్రలేచే అలవాటు చేసుకోండి. రోజు హాయిగా ఉండడానికి ఉదయం పూట మెలోడీ సంగీతం వినడం మంచిది. సంగీతం మనలో చైతన్యం పెంచుతుంది. అంతేకాకుండా మన మూడ్‌ రొటీన్‌గా ఉండకుండా సంగీతం సాయం చేస్తుంది.

ఉదయాన్నే తొందరగా లేవడం అలవాటు చేసుకోండి. అలాగే కనీసం 8గంటల పాటు పడుకొనే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అలా అని మరీ ఎక్కువ కూడా పడుకోవద్దు. ఉదయం లేవగానే నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. ఇది శరీరంలో పిహెచ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి.

ఇక రాత్రి పడుకొనే సమయంలో నిద్ర రాకపోతే పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఆందోళనలు తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది. దినచర్య ఉత్సాహంగా మార్చడంలో వ్యాయామం పాత్ర కూడా కీలకమే. పొద్దున్నే కనీసం అరగంటసేపు యోగా, ధ్యానం చేయడం వల్ల ఉత్సాహంగా మారుతుంది.

మీరు కూడా ఈరోజు నుంచి నిద్రలేవగానే ఇలాంటి చిన్నపాటి చిట్కాలు పాటించండి. దానివల్ల అనుకున్నది సాధించగలం. రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలం.

Leave a Comment