Sleep hygiene : సరైన నిద్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

By manavaradhi.com

Updated on:

Follow Us
Sleep hygiene

మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. అయితే చాలామంది తమకు నిద్ర పట్టడంలేదని.. వాపోతుంటారు. కొంతమంది నిద్ర లేమితో అనారోగ్యానికి గురవుతుంటారు కూడా.. అయితే మంచి నిద్ర పట్టాలంటే.. తమ దైనందిన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంది. అంతేకాదు.. నిద్ర పట్టకుండా చేసే అంశాల గురించి ఆలోచించాలి. అందుకని మంచి నిద్ర పట్టాలంటే మన దైనందిన అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు కొన్ని చిట్కాలను పాటిస్తే.. హాయిగా నిద్ర పడుతుంది.

మన చుట్టూ ఉండే కొన్ని వాసనలతో బాగా విశ్రాంతి తీసుకోవచ్చా? అవుననే అంటోంది శాస్త్రం. అనేక అధ్యయనాల సమీక్షలో కొన్ని సువాసనలను పీల్చడం వల్ల ఎంత బాగా నిద్రపోయారో కనుగొన్నారు. అరోమాథెరపీ …ఇది తగినంత మరియు నాణ్యమైన నిద్రను అందించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. లావెండర్, పిప్పరమెంటు, చమోమిలే మరియు మార్జోరామ్ మరియు ఆరెంజ్ ఆయిల్ అన్నీ ఇతర వాసనలతో పాటు పనిచేస్తాయని ఆధారాలు ఉన్నాయి. లావెండర్‌ మొక్కల నుంచి వచ్చే పరిమళం ఒత్తిడిని దూరం చేస్తుంది. మంచి, ప్రశాంతమైన నిద్ర పట్టేలా చూస్తుంది.

శరీరంలోని కీ పాయింట్స్‌ అయిన ‘ఆక్యు పాయింట్స్‌’ మీద ఒత్తిడి కలిగించటం ద్వారా శరీరంలోని సహజ సిద్ధమైన క్యూరేటివ్‌ స్కిల్స్‌ను వెలికితీసే చికిత్సా విధానమే ఆక్యుప్రెషర్‌. ఈ ఆక్యుప్రెషర్‌ ముఖ్యంగా నిద్రలేమితో బాధపడే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అనవసరపు ఆలోచనలు రాకుండా కంట్రోల్‌‌ చేసుకోలేకపోతే, దీనికి రోజులో ఒక టైం పెట్టుకోవాలి. పడుకునే ముందు లేదా సాయంత్రం అవసరమైన విషయాల గురించి ఆలోచించాలి. అప్పుడే ఆ విషయాల మీద ఒక అభిప్రాయానికి వచ్చి, ఆ తరువాత ఆలోచనల్ని వదిలేయాలి. దీన్ని వర్రీయింగ్‌‌ టైం అంటారు. 15–30 నిమిషాల వరకు దీనికి కేటాయించాలి. ఈ టైంలో మనసుకు ఒత్తిడి కలిగించే అంశాల్ని రాసుకుని, వాటికి పరిష్కారం కనుక్కుని రిలాక్స్ అవ్వాలి.

స్లీప్ హైజీన్ అంటే ఏంటి…?

నాణ్యమైన నిద్ర… నిద్రకు సంబంధించిన ఆరోగ్యం (స్లీప్ హైజీన్) నిద్రలోని నాణ్యతను పెంచడం, నిద్రకు ఉపక్రమించాక ఎంత వీలైతే అంత వేగంగా నిద్రలోకి వెళ్లిపోవడం కోసం మనం అనుసరించే అలవాట్లు, సంప్రదాయాలను స్లీప్‌హైజీన్‌గా చెప్పుకోవచ్చు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకేవేళకు నిద్రకు ఉపక్రమించాలి. అంటే ఒక స్లీప్ షెడ్యూల్‌ను అనుసరించాల న్నమాట. అలాగే ప్రతిరోజూ నిద్ర తర్వాత నిర్ణీతమైన ఒకేవేళకు నిద్రలేవాలి. అది సెలవు రోజైనా, తీరికగా గడిపే మరే రోజైనా సరే… నిద్రవేళలలో ఎలాంటి మార్పులూ ఉండకూడదు. కనీసం ఏడు గంటలు నిద్రపోవడానికి వీలుగా ఉండేలా ఒక నిర్దిష్టమైన వేళను నిర్ణయించుకొని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సమయానికి బెడ్‌పై ఉండి నిద్రకు ప్రయత్నించాలి.

కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) అనే ఈ తరహా వైద్య ప్రక్రియను అనుసరించడం వల్ల బాగా నిద్రపోయే సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు గాఢనిద్ర కూడా సాధ్యమవుతుంది. దీన్ని అనుసరించడం చాలా సులభం కూడా. పడకమీదికి చేరిన 20 నిమిషాల తర్వాత కూడా మీరు మెలకువతోనే ఉంటే మళ్లీ మరింత రిలాక్స్ అయ్యే ప్రక్రియలైన ధ్యానం వంటి టెక్నిక్స్ అవలంబించండి. మీకు నిద్రవచ్చినట్లు అనిపించినప్పుడే మళ్లీ పడక మీదికి వెళ్లండి. ఈ పద్ధతులను అనుసరిస్తున్న సమయంలో ఒక దశ తర్వాత మీరు పక్క మీదికి చేరగానే నిద్రపోయే పరిస్థితి తప్పక వస్తుంది.

నిద్ర లేమి సమస్యను అందిగమించి, నాణ్యమైన నిద్ర కోసం ప్రయత్నించడం ద్వారా నాణ్యమైన జీవితాన్ని అందుకోవచ్చు. ఇందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ప్రధానమైనది రోజూ ఒకటే వేళ నిద్రకు ఉపక్రమిస్తుండాలి. 20 నిముషాల వరకూ నిద్ర పట్టకుంటే, ధ్యానం లాంటి వాటి ద్వారా సాంత్వన పొంది నిద్రకు ఉపక్రమించాలి. పడక గదిని నిద్ర పోవడానికి, విశ్రాంతికి మార్గంగా మార్చుకోవాలి. అక్కడే తినడం, ఆఫీసు పనులు చేసుకోవడం లాంటివి చేయకూడదు. నిశ్శబ్ధంగా, రణ గొణ ధ్వనులు లేకుండా తీర్చిదిద్దుకోవాలి. అదే విధంగా గదిలో ఉష్ణోగ్రతను ఆహ్లాదంగా ఉంచుకోవడం, పరిమళ భరితంగా మార్చుకోవడం వల్ల కూడా చక్కని నిద్రకు అవకాశం ఉంటుంది.

మీకు నిద్రపట్టకపోవడానికి వెతుక్కునే కారణాల్లో ప్రతికూలమైన కారణాలనూ, ప్రతికూలమైన ఆలోచనలనూ నియంత్రించుకోండి. నిద్రపట్టని సమయంలో ఆలోచనలన్నీ సానుకూల దృక్పథంతో ఉండేలా ఆలోచించడం అలవాటు చేసుకోండి. నిద్రవేళకు మీ వృత్తిపరమైన ఆలోచనలనూ, టెన్షన్లనూ, విచారాలను వదిలించుకోండి. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇందుకు బాగా పనికివస్తాయి. దాంతో మీ ఆలోచనలు స్థిమితపడి మీకు తేలిగ్గా నిద్ర వస్తుంది. నిద్రపట్టని వేళల్లో ఆహ్లాదకరమైన ఊహలను పెంచుకోవడం అనే ప్రక్రియను అనుసరించండి. మీకు ఆనందం కలిగించే ఊహలనూ, ఉదంతాలనూ ఒక కథలా అల్లుకుంటూ ఆలోచిస్తూపొండి. మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు.

రోజూ రాత్రి పడుకునేముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయడం లేదా మంచి మంచి దృశ్యాల్ని ఊహించుకుని మెమరైజ్ చేయడం అలవాటు చేసుకోండి. కచ్చితంగా ఫలితముంటుంది. లేదా శ్రావ్యమైన సంగీతాన్ని స్లో వాల్యూమ్‌లో పెట్టుకుని వింటూ ప్రశాంతంగా కళ్లు మూసుకుని ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది.

Leave a Comment