చాలా మందిని ఎన్నో రకాల సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. చర్మం పొడిబారడం దగ్గర్నుంచి, పగుళ్ళ వరకూ అనేక సమస్యలు ఇబ్బందికరంగా మారతాయి. ఈ పరిస్థితుల్లో చర్మాన్ని కాపాడుకోవడానికి చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు. డై స్కిన్ తో బాదపడుతున్న వారుచర్మ సంరక్షణ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు..?
ఈ శీతాకాలంలో ఒక పక్క దాహం వేయదు, మరో పక్క చర్మంలో తేమ తగ్గిపోతూ ఉంటుంది. సాధారణంగానే పొడి చర్మం ఉండే వారి పరిస్థితి ఈ సమయంలో మరింత తీవ్రంగా ఉంటుంది. ఒక్కో సారి చర్మం మీద తెలియని గాయాలు కూడా సతమతం చేస్తూ ఉంటాయి. నిజానికి చర్మ సమస్యలు ఎదురు కావడానికి ప్రధాన కారణాల్లో దాహం వేయకపోవడం కూడా ఒకటి. బయట చల్లగా ఉండడం వల్ల ఎక్కువ మంది నీరు తాగేందుకు ఆసక్తి చూపరు. ఫలితంగా శరీరంలో డీ హైడ్రేషన్ మొదలౌతుంది. అందుకే చర్మ సంరక్షణ కోసం ప్రధానంగా చేయవలసిన పని నీటిని ఎక్కువగా తీసుకోవడమే. చాలా మంది ఈ డ్రై స్కిన్ నుంచి రక్షణ కోసం రకరకాల లోషన్లను వాడుతూ ఉంటారు. అయితే వైద్యుని సలహా లేకుండా ఏ విధమైన లోషన్లు, క్రీములు వాడడం అంత మంచి పద్ధతి కాదు. ఎందుకంటే చాలా మందిలో వారసత్వం కారణంగా కూడా డ్రైస్కిన్ సమస్య ఏర్పడుతుంది.
- డ్రై స్కిన్ తో భాదపడుతున్నవారు చర్మం ఎందుకు పొడిబారుతుందో తెలుసుకోవాలి. సాధారణంగా ఆరోగ్యవంతమైన చర్మం మీద స్వభావ సిద్ధమైన పలుచని నూనె పొర ఉంటుంది. ఇది చర్మం యొక్క తేమను కోల్పోకుండా సంరక్షిస్తుంది.
- చర్మం పొడిబారడానికి అనేక కారణాలున్నాయి. సాధారణంగా చర్మం మీద ఏ ఉత్పాదనలను ఉపయోగిస్తున్నారో, వాటి వలన చర్మం యొక్క సహజ సిద్ధమైన నూనె తక్కువైపోతుంది. అందుచేత చర్మం సంరక్షణను కోల్పోతుంది. కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా చర్మం పొడతబారుతుంది. ముఖ్యంగా డయాబెటిస్, థైరాయిడ్, క్యాన్సర్ సమస్యలు ఉన్న వారిలో ఇలాంటి పరిస్థితి ఎదురౌతుంది. ఇటువంటి వారు వైద్యుని సలహా లేకుండా అధికంగా కాస్మటిక్స్ వాడడం వల్ల, ఇందులోని కెమికల్స్ చర్మం లోపల అలానే ఉండిపోయి, సమస్యను మరింత జటిలం చేస్తాయి.