నేడు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల మనిషికి పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఎండలు పెరిగిపోవడం, చలి ఎక్కువవడం వంటి వాతావరణ మార్పుల వల్ల ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. అందుకే మనిషి మండుటెండల నుండి రక్షణ కోసం జాగ్రత్తలు తీసుకున్నట్టే చలికాలంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ చలికాలంలో పిల్లలే కాదు పెద్దలు కూడా చలి బారి నుంచి రక్షణ పొందేందుకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం రానే వచ్చింది. ఈ చలి నుంచి రక్షణ పొందేందుకు పెద్దలు, పిల్లలు.. ఇప్పటివరకు మూలనున్న స్వెట్టర్లు, టోపీలు, శాలువలు, రగ్గులకు పని పెట్టాల్సిన సమయం మళ్ళీ వచ్చింది. అలాగే పిల్లలు, పెద్దలు బూట్లు, సాక్స్ వేసుకుంటుంటారు. ఇలా శీతాకాలంలో సాక్స్ తొడుక్కోవడం వల్ల పగుళ్లు తగ్గుతాయి. కొందరిలో ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. మరికొందరిలో ముఖం జిడ్డుగా మారే అవకాశం ఉంది. కొద్దిపాటి అనారోగ్యంతో బాధపడే వారు వైద్యుని సలహా మేరకు ఏవిధమైన ఆహారాన్ని తీసుకోవచ్చో తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలి తాకిడి నుంచి రక్షణ పొందవచ్చు.
శీతాలకాలంలో వీచే బలమైనటువంటి చల్లగాలులు, లోలెవల్ మాయిశ్చరైజర్ వల్ల చర్మం, కేశాలు పొడిబారడం, దురద, పాదాల పగుళ్ళు, ఒంటి మీద గీతలు ఇలా ఇంకా ఎన్నో సమస్యలను తెచ్చి పెట్టడంతో పాటు చర్మ సంరక్షణ అవసరాన్ని పెంచుతోంది. ఈ చలి గాలులకు చర్మం పొడిబారకుండా ఉండాలంటే చర్మ సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలోని వాతావరణం చర్మం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా పెదవులు, ముఖం, చేతులు, పాదాలు చల్లా గాలికి దెబ్బతినడం వల్ల కొన్నిసార్లు ముఖం మీద, చర్మం మీద చెమట పొక్కులు ఏర్పడతాయి. పాదాల చివర పగుళ్లు వస్తాయి. చర్మానికి వచ్చే ఇలాంటి మార్పుల వల్ల చర్మపు సౌందర్యం దెబ్బతింటుంది. చర్మం పొడారి పోయి దురద కూడా ఉంటుంది. అంతేకాదు పెదాలు పగులుతాయి.
చలికాలంలో చర్మాన్ని సంరక్షించేందుకు చర్మసౌందర్యాన్ని కాపాడేందుకు మార్కెట్లో ఎన్నెన్నో సౌందర్య సా ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకుందాం.
- గోరు వెచ్చని నీటితో రెండు పూటలా స్నానం చేయడం ముఖ్యం.
- మంచినీళ్లు ఎక్కువగా తాగడం కూడా చేయాలి.
- దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి.
- చల్ల గాలికి తిరుగవద్దు.
- శ్వాసనాళాలు మూసుకుపోకుండా మందులు వాడాలి
- ద్విచక్రవాహనంపై ప్రయాణించే వారు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలి.
- గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు వాకింగ్ చేయవద్దు.
- బీపీ, షుగర్ వ్యాధి ఉన్నవారు చల్ల గాలికి తిరగకూడదు.
- పిల్లలకు చలి నుంచి రక్షణ కోసం స్వెటర్లను తొడిగించాలి
- పిల్లలకు వేడినీటితో స్నానం చేయించాలి.
- రోజూ పడుకునే ముందు, నిద్రలేవగానే మాయిశ్చరైజర్లు రాసుకోవాలి.
- పెదాలకు వ్యాజిలిన్, లిప్‌గార్డ్ రాసుకోవడం మంచిది.
చలికాలమనేది చర్మ సంరక్షణకు అధికప్రాధాన్యత ఇవ్వవలసిన కాలము . ప్రత్యేకించి ముఖ సౌందర్యాన్ని కాపాడుకోడానికి తగినంత సమయం ఇవ్వాలి. చలికాలం అనగానే తెల్లవారుజామునే ఆరుబయట మంటలు కాపేసుకోవడం చాలమందికి అలవాటు. కాబట్టి ఇలా మంటలు వేసుకునే సమయంలో చిన్నారులు, దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలి. మంట వద్ద సరదా ఆటలు ఆడటం ప్రమాదకరం. అంతేకాదు అధిక చలివల్ల బాడీసెల్‌లో తేమ తగ్గి చర్మం పొడిబారుతుంది. దీనివల్ల చర్మసంబంధిత వ్యాధులు వస్తాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ మాయిశ్చరైజర్‌లను వినియోగించాలి. ముఖ్యంగా మహిళలు ఈ శీతాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా ఎన్ని క్రీములు రాసుకున్నా, పేషియల్స్ వాడినా తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని ఫిట్‌నెస్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.