Health Tips – ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందా ?

By manavaradhi.com

Published on:

Follow Us
Breathing

జీవ‌క్రియ‌ల్లో అతిముఖ్య‌మైన శ్వాస‌క్రియ‌లో ఇబ్బంది త‌లెత్తితే ఏం జ‌రుగుతుందో మ‌న‌కు తెలియంది కాదు. అందుక‌ని శ్వాస‌వ్య‌వ‌స్థ‌లో మార్పులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త మ‌నపైనే ఉన్న‌ది. శ్వాస‌తీసుకోవ‌డంలోఎందుకు ఇబ్బందులు వ‌స్తాయి..? కార‌ణాలేంటి..? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి..?

జీవక్రియల్లో అతి ముఖ్యమైనది శ్వాసక్రియ. ఇది విచ్ఛిన్న క్రియ. ఆహారం పేగు గోడల ద్వారా శోషితమై రక్తంతో క‌లుస్తుంది. గ్లూకోజ్‌, కొవ్వులు, ప్రోటీన్‌ల నుంచి శరీరానికి కావలసిన శక్తినిచ్చే క్రియ శ్వాసక్రియ. సాధారణంగా రోజుకు30 వేల‌సార్లు శ్వాసక్రియ జరుగుతుంది. అంటే నిమిషానికి 20 సార్లు ఆరోగ్య వంతుని శ్వాసక్రియ జరుగుతుంది. మనం గాలి తీసుకుని వదలటం బాగా కష్టమవుతుంటే దాన్ని ఆయాసం అంటారు. శ్వాస మండలంలో అవరోధం ఏర్పడడం వల్ల, శ్వాస మండలంలోని గాలి వెళ్లే మార్గంలో గోడలు కుచించుకుని, గాలి వెళ్లకుండా అడ్డుకోవడం వల్ల, ఈ పక్రియ చలనానికి ప్రధాన కారణమైన వేగస్ నెర్వులో కొంత మార్పు రావడం వల్ల, శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే ఊపిరితిత్తులలోని పొరలు ఏ కారణంచేతనైనా రేగడం వల్ల గానీ ఆయాసం రావ‌చ్చు. ఎక్కడో ఏదోక కారణంవల్ల ఊపిరితిత్తులలోని పొరలు కుచించుకుపోవడం వల్ల, ముఖ్యంగా ముక్కు, గొంతు, జీర్ణాశయాలలో వచ్చే వ్యాధుల వల్ల, కొంతమందికి కొన్ని పదార్థాల వాసనలు, వాతావరణం పడవు. దాన్ని ఎలర్జీ అంటారు. దాన్నివల్ల కూడా గాలి అరలు సంకుచితమై ఆయాసం వస్తుంది. గుండెలో వచ్చే మార్పులవల్ల కూడా ఆయాసం వస్తుంది. దీన్ని కార్డియాక్ ఆస్త్మా అంటారు. అతి నీరసంవల్ల, రక్తం తగ్గినపుడు, పాండు వ్యాధులోనూ కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉంది.

ఆయాసంవల్ల మనిషి నిస్సత్తువతో కదలలేక, కూర్చోలేక, పడుకోలేక అవస్థ పడుతుంటారు. కొంచెం నడిస్తే ఆయాసం వచ్చి, కూర్చుంటే లేదా కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంటే.. అది గుండెకు సంబంధించిన ఆయాసం. ఆ వ్యక్తి ఇలాంటి సమయంలో వెల్లకిలా పడుకోలేడు. హఠాత్తుగా ఆరంభమై ఆయాసంతోబాటు పిల్లికూతల వంటి శబ్దం వస్తుంటే అది ఆస్త్మా అని అర్థం. మాములుగానే గాలి తీసుకునే సమయం, వదిలే సమయం కన్నా ఎక్కువగా వుంటుంది. ఈ రెంటికి మధ్య వ్యత్యాసాలు ఆయాసాన్ని సూచిస్తాయి. ఆయాసం వ‌చ్చిన‌ప్పుడు శ్వాస‌నిలిచిపోయిన‌ట్టుగా, ఛాతిలో ఇబ్బందిక‌రంగా అనిపించ‌డం, గాలి తీసుకోవ‌డం కోసం ఆరాట‌ప‌డ‌టం, లోతుగా శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బంది వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. ఇది ఒక్కోసారి జ్వ‌రం, ద‌ద్దుర్లు, ద‌గ్గు వంటి ఇత‌ర ల‌క్ష‌ణాల‌తో కూడా క‌నిపిస్తుంది. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిక‌రంగా ఉన్న కార‌ణంగా న్యుమోనియా, ఇతర శ్వాస సంబంధిత అంటువ్యాధులు, ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం, చోకింగ్, శిథిలమైన ఊపిరితిత్తులు, గుండెపోటు, గుండె ఆగిపోవుట, తీవ్రమైన అలెర్జీ ప్రతిస్పందన వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి.

అల‌స‌ట స‌మ‌స్య తీవ్ర‌మైన వారిలో సీవోపీడీ, ఆస్త‌మా, కార్డియోమ‌యోప‌తి, ఒబేసిటీ, ప‌ల్మ‌న‌రీ హైప‌ర్‌టెన్ష‌న్‌, ఊపిరితిత్తుల‌పై మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌టం వంటి వ్యాధులు రావ‌చ్చు. ఎల‌ర్జీ వ‌చ్చేందుకు అవ‌కాశ‌మున్న ఇంటిలో దుమ్ము దులపడం, పడని పదార్థాలు తినడం, పడని గాలిని పీల్చడం, శీతల ప్రాంతంలో తిరగడం వంటి వాటికి దూరంగా ఉండాలి. త‌రచూ ఉప‌వాసాలు చేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి. చల్లటి పదార్థాలు, కూల్‌ డ్రింక్స్, ఐస్‌ క్రీమ్‌లు తిన‌డం మానుకోవాలి. బెండకాయ, చేమదుంప, పెరుగు, కొబ్బరి, చేప, సొరకాయ, దుంపకూరలు, బచ్చలికూర, ఎక్కువ పుల్లటి పదార్థాలు తినకూడదు. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు రాత్రి వేల‌ళ్లో త‌ప్ప‌నిస‌రి బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తే త‌ల‌పై కప్పుకొవ‌డం చేయాలి. వ్యాయామం, ర‌న్నింగ్ చేస్తున్న సంద‌ర్భాల్లో శ్వాస‌తీసుకోవ‌డంలో ఇబ్బంది క‌లిగితే స‌రైన శిక్ష‌కుల సాయం తీసుకోవాలి. మ‌రీ ఎక్కువ‌గా ఇబ్బంది ఉంటే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవాలి.

ఆయాసం ప్రాణాపాయం కాదు. కాని చివరి వరకూ బాధపెడుతుంది. ఆయాసం ఎక్కువచేసే పదార్థాలు తినకుండా వుండేలా జాబితా సిద్ధంగా ఉంచుకొని పాటిస్తుండాలి. శ్వాస‌తీసుకోవ‌డం ఇబ్బందిగా అనిపించిన మ‌రు నిమిష‌మే వైద్యుల‌ను సంప్ర‌దించి చికిత్స తీసుకోవ‌డం చాలా ఉత్త‌మం.

Leave a Comment