సాధారణంగా మనం నిత్య జీవితంలో గుండెకు సరిపడేవి.. అలాగే సరిపడని అంశాలు ఎన్నో ఆచరిస్తూ వుంటాం. అవి చిన్న చిన్న అంశాలే అయినప్పటికి వాటి ప్రభావం గుండె ఆరోగ్యంపై ఎంతో ఉంటుంది. అలాగే గుండె తీరు కూడా మన శరీరం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
గుండె ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టే. గుండె అనేది శరీరంలోని ముఖ్యమైన అవయవం. గుండె పనితీరు సజావుగా ఉంటే శరీరంలోని అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. గుండె పనితీరు సరిగ్గా లేదంటే ఆ ప్రభావం ఇతర అవయవాలపై పడుతుంది. రక్తాన్ని ఫిల్టర్ చేసి శరీరంలోని ప్రతి భాగానికి అక్షిజెనెటేడ్ రక్తాన్ని ఆర్టెరీస్ ద్వారా సరఫరా చేయడంలో గుండె ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కొన్ని వ్యాధుల వలన, కొన్ని ప్రమాదాల కారణంగా గుండె సరిగ్గా పనిచేయకపోతే శరీరంలోని ఇతర అవయవాలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడవచ్చు. తద్వారా, వాటి పనితీరు కూడా దెబ్బతింటుంది. ఆధునిక జీవన పద్దతిని అలవాటు చేసుకోవడం ద్వారా మనంతట మనమే గుండెను ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాం. సాధారణ గుండె సమస్యల కారణొంగా.. రక్త పోటు అదుపులో లేకపోవడం, మధుమేహం అదుపులో లేకపోవడం, చిన్న చిన్న రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడం వంటి అనేవి ప్రభావితమవుతాయి.
గుండెకు కావలసిన రక్తాన్ని కరోనరీ ఆర్టరీస్ అందించలేకపోవడం వల్ల కరోనరీ ఆర్టరీస్ వ్యాధి వస్తుంది. దీని వల్ల గుండె నుంచి రక్తాన్ని తీసుకొనిపోయే ధమనుల్లో అడ్డుగోడలు ఏర్పడి రక్తం సరఫరా నిలిచిపోతుంది. ఫలితంగా శరీరంలోని వివిధ భాగాల్లో పనులు నిలిచిపోయే ప్రమాదముంటుంది. ఈ సమస్య ఆడవారిలో కన్నా మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండె కవాటాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కూడా రక్తం సరఫరాలో అడ్డంకులు ఏర్పడి కొత్త సమస్యలు రావచ్చు. గుండె లయబద్దంగా కొట్టుకోవడం నిత్యం జరిగేది. అయితే గుండె సంబంధ సమస్య ఏదైనా వస్తే ప్రధానంగా లయపై ప్రభావం చూపుతుంది. గుండె కండరాలు సాధరంగా ఉండే పరిమాణంగా కన్నా ఎక్కువగా, మందంగా, గట్టిగా ఉండే కార్డియోమయోపతిగా అనుమానించాలి. ఈ సమయంలో గుండె బలహీనంగా మారి జఠరికలపై ప్రభావం చూపి శరీరంలో చివరి భాగంకల్లా రక్తం సరఫరా జరుగదు. ఫలితంగా కాళ్లలో వాపులు, తలతిరగడం, మూర్చ, అలసట వంటి సమస్యలు కనిపిస్తాయి. శరీరంలోని ఇతర భాగాలకు మాదిరిగానే గుండెకు కూడా బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయ. పుట్టుకతో వచ్చే గుండె లోపాల కారణంగా కూడా శరీరంపై ప్రభావం ఉంటుంది.
మన శరీరం ఆరోగ్యంగా ఉండేలా.. గుండె బలంగా తయారయ్యేలా విటమిన్లు, పోషక పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు, కాయగూరలు, ఆకు కూరలు మొదలైనవి గుండె జబ్బు సోకే ప్రమాదాన్ని నివారిస్తాయి. శారీరక శ్రమ, వ్యాయామాలు తప్పనిసరిగా అలవర్చుకోవాలి. మద్యపానం, ధూమపానం, తీవ్రమైన ఒత్తిడికి లోనుకావడం, మాదక ద్రవ్యాలు సేవించడం మొదలగు చెడు అలవాట్ల వల్ల గుండెకు తీవ్రమైన హాని కలుగుతున్నందున పూర్తిగా మానుకోవాలి. ఫ్రైలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ఆర్టిఫిషియల్ షుగర్స్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగకుండా ఉండటం మేలు. కొలెస్ట్రాల్ స్థాయి పెరుగకుండా చూసుకోవాలి. మధుమేహం సమస్య ఉన్నవారు రక్తంలో చక్కెర శాతం పెరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
గుండె కొట్టుకోవడంలో ఒక రిథమిక్‌గా ఉంటుంది. ఆ రిథమ్‌లో ఏమాత్రం తేడా వచ్చినా శరీరంపై ఏదో ప్రభావం చూపుతున్నదని అనుమానించాలి. వెంటనే గుండె వైద్యనిపుణులను సంప్రదించి తగు చికిత్స పొందాలి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేలా సహకరించే పోషకాహారాన్ని తీసుకోవడం మర్చిపోవద్దు.






