Fish Oil : చేపనూనెతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా?

By manavaradhi.com

Published on:

Follow Us
Fish Oil for Health

చేప నూనె అనేది ఎక్కువ జిడ్డు కలిగిన చేపల కణజాలం నుంచి సేకరిస్తారు. ముఖ్యంగా సాల్మన్, వైట్ ఫిష్, హెర్రింగ్, సర్డినెస్, అన్కోవిస్ అనే చేపల నుంచి చేపనూనెను తీస్తారు. చేప నూనెలో 30 శాతం ఒమేగా 3 ఫాటీ ఆసిడ్స్ ఉండగా, మిగిలిన 70 శాతం ఖనిజాలు, పోషకాలతో నిండి ఉంటుంది. అందుక‌ని చేపని ఆరోగ్య ప్రదాయినిగా వ్యవహరిస్తుంటారు.

చేపనూనె అనేక సమర్ధవంతమైన ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది. చేప నూనెలతో కూడిన కాప్స్యూల్స్ తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వులు కలిగించే దుష్ర్పభావాలను తగ్గించుకోవచ్చునని బ్రెజిల్‌లోని సాపాలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఊబకాయాన్ని నివారించేందుకు, మధుమేహాన్ని అడ్డుకునేందుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు.

ఆస్తమాతో బాధపడే చిన్నారులు చలికాలం వస్తే…మరింతగా వారి బాధ పెరుగుతుంటుంది. ఆయాసంతో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. పిల్లలు ఈ బాధకి గురికాకుండా ఉండాలంటే.. తల్లి గర్భవతిగా ఉన్నపుడు ఆహారంలో చేపనూనెని తీసుకోవాలని చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో చివరి మూడునెలలు చేపనూనెని తీసుకుంటే పిల్లలు.. ఐదేళ్లలోపు ఆస్తమా బారినపడకుండా ఉంటారని వారు చెప్తున్నారు. కాగా, ప్రతీ రోజూ పిల్లలకు కాస్తంత చేపనూనె పెడితే పరీక్షల్లో మంచి ప్రతిభను ప్రదర్శించగలరని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

చేప‌నూనెల‌ను చిన్న‌వ‌య‌సు నుంచే అల‌వాటు చేసుకొన్న‌వారిలో నరాల నొప్పి, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి వంటి సమస్యలను ఇట్టే పోగొట్టుకోవచ్చు. గుండెలయ తప్పటం, గుండెపోటు, పక్షవాతం వంటివి రాకుండా చూస్తాయనీ నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండే ఒమేగా 3 ఆమ్లాలు శరీరక్రియలు సక్రమంగా జరిగేలా పనిచేస్తాయి. ముఖ్యంగా డీహెచ్‌ఏ, ఈపీఏ చిన్నారుల్లో చిగుళ్లవ్యాధిని సమర్థంగా అడ్డుకుంటున్నాయని కొన్ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

చేప నూనె తీసుకోవడం ద్వారా , స్కిజోఫ్రీనియా మరియు బైపోలార్ డిజార్డర్స్ వంటి మానసిక వ్యాధులని నివారించవచ్చు. చిన్న‌నాటి నుంచి చేప‌నూనెలు తీసుకొన్న వారిలో శారీరక పెరుగుదల, మానసిక అభివృద్ధి విక‌సిస్తుంద‌ని పోష‌కాహార‌నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. చిన్నారుల్లో సాధార‌ణంగా క‌నిపించే జలుబు, దగ్గు, ఫ్లూ జ్వ‌రాలను సైతం ఎదుర్కొనగలదు. చేప నూనె వినియోగం వలన జ్వరం, చర్మ వ్యాధులు మరియు అలసట తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ వంటి స‌మ‌స్య‌ల‌ను తగ్గించుటలో చేప నూనె ఎంత‌గానో సహాయపడుతుంది. చిన్న‌నాటి నుంచే చేప‌నూనెల‌ను వినియోగించ‌డం ద్వారా వృద్ధాప్యంలో వ‌చ్చే దృష్టిలోపం స‌మ‌స్య‌ల‌తోపాటు ఆర్థ‌రైటిస్ వంటి ఆరోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. వంశ‌పారంప‌ర్యంగా వ‌చ్చే క్యాన్స‌ర్ క‌ణాల‌ను స‌మూలంగా నాశ‌నం చేయ‌డంలో చేప‌నూనెలు అద్భుతంగా ప‌నిచేస్తాయి.

విద్యార్థులు చేప‌నూనె తీసుకోవ‌డం ద్వారా వారిలో ఎక్కువ జ్ఞాప‌క‌శ‌క్తి మ‌రియు మెదడు చురుగ్గా పనిచేయటంలో చాలా దోహదపడుతుంది. అలాగే ఒత్తిడిని జ‌యించేందుకు చేప‌నూనె దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు వెల్ల‌డించాయి. సో మీ చిన్నారుల‌కు ఇప్ప‌టినుంచే చేప‌నూనెను ఇవ్వ‌డం అల‌వాటు చేసి వారి ఆరోగ్యానికి బాట‌లు వేయండి.

Leave a Comment