Health Tips : పెరుగు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

By manavaradhi.com

Published on:

Follow Us
Benefits Of Curd

పెరుగు.. చాలా మందికి ఈ ప‌దార్థం లేనిదే భోజ‌నం ముగించిన‌ట్టు అనిపించ‌దు. నిత్యం పెరుగు తీసుకోవ‌డం దివ్యౌష‌ధంలా ప‌నిచేస్తుంది. రోజుకు రెండుసార్లు పెరుగు తిన‌డం వ‌ల్ల శ‌రీరం ఆరోగ్యం ఉంటుంద‌ని పోష‌కాహార నిపుణులు సెల‌విస్తున్నారు.

మన నిత్యజీవితంలో యోగర్ట్ ప్రాధాన్యత ఎనలేనిది. ఇందులో పుష్కలంగా ఉండే న్యూట్రిన్లు శరీరానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. ఈ యోగర్ట్ తిన‌డం వ‌ల్ల బరువు తగ్గుతామ‌నే భ‌యంతో, నిద్ర ముంచుకు వస్తుందన్న ఆందోళ‌న‌తో ఈ మధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు. ఆరోగ్యాన్నివ్వటంలో ఈ పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. విదేశాల్లో అయితే ఆవు పాలతోనే పెరుగు తయారుచేస్తుండ‌గా.. మన దేశంలో మాత్రం గేదె పాలతోనూ పెరుగు తయారుచెయ్యటం పరిపాటి. ఈ పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, అత్య‌వ‌స‌ర‌ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి.

ఏ కాలంలోనైనా ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా చాలామంది ఇష్టంగా తినే పదార్థం యోగర్ట్. అయితే ఈ యోగర్ట్ తినడానికి ఇష్టపడనివారు కొందరు ఉంటారు. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటే యోగర్ట్ లో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. యోగర్ట్ లో శరీరానికి మేలు చేసే లాక్టోబాసిల్లస్ అడినోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ అనే మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. రోజూ 300 మిల్లీలీటర్ల యోగర్ట్ తీసుకొంటే ఆస్టియో పోరోసిస్, వివిధ క్యాన్సర్లు, ఉదర సంబంధ రోగాల బారిన పడకుండా ఉండొచ్చని చెబుతున్నారు వైద్య‌నిపుణులు. నిత్యం యోగర్ట్ తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. యోగర్ట్ ద్వారా పాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి. శరీరంలో బీ, టీ వంటి తెల్ల రక్తకణాలను పెంచి వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెరిగేలా చూస్తుంది. డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నవారు యోగర్ట్ తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ ను తొలగించి.. మనం తినే ఆహారం ప్రేగుల్లో సులభం జీర్ణం అవ్వడానికి ఉప‌యోగ‌ప‌డే విట‌మిన్ కే ను అందించి సహాయపడుతుంది.

యోగర్ట్ లో విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, మరియు ఇతర మైక్రో మినరల్స్ అధికంగా ఉండి చర్మం రంగును మెరుగుపరుస్తాయి. మొటిమలను, మచ్చలను తొలగిస్తాయి. ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి. రోజూ అరకప్పు పెరుగు తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని కంట్రోల్‌ చేయటంతో పాటు చక్కని మూడ్‌ లిఫ్టర్‌ అంటున్నారు శాస్త్రవేత్తలు. స‌న్ బ‌ర్న్ ను నివారించ‌డంలో చాలా మెరుగ్గా ప‌నిచేస్తుంది. యోగర్ట్ తిన‌గానే క‌డుపు నిండినట్టు ఉండి డైట్ కంట్రోల్ అవ్వ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎలాంటి ఫ్యాట్ లేకపోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

ఆవు పాలతో పోల్చినప్పుడు గేద పాలలో ఫ్యాట్ కంటెంట్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. అందుకే చాలా మంది గేద పాలతో చేసిన పెరుగును తినడం వల్ల జీర్ణం కాద‌ని భ‌య‌ప‌డుతుంటారు. అయితే గేద పాలతో చేసిన పెరుగు కంటే ఆవు పాలతో తయారుచేసిన పెరుగును తినడం మంచిద‌ని సూచిస్తున్నారు పోష‌కాహార నిపుణులు.

Leave a Comment