శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. వారానికి ఒకసారి అయినా జిమ్ కి వెళ్లాలి. అయితే చాలామంది వర్కవుట్లు చేస్తున్న సమయంలో అనేక తప్పులు చేస్తుంటారు. ఈ తప్పులు చేయడం వల్ల వారి ఆరోగ్యం మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి.
మనలో చాలామంది ప్రతి వారం జిమ్ క్లాసులకు హాజరవుతారు. బరువులు ఎత్తుతారు. చెమటలు కక్కుతారు.మీరు గనక ఇన్ స్ట్రక్టర్ అయితే సర్వసాధారణంగా చేసే మిస్టేక్స్ మళ్లీ చేయకుండా జాగ్రత్తపడాలి. ఎందుకంటే మీరొక్కరు మిస్టేక్ చేస్తే క్లాసులో ఉన్న ప్రతీ ఒక్కరూ మిస్టేక్ చేస్తారు. వర్కవుట్లు ఎక్కువగా చేయడం వల్ల అదనంగా కేలరీలు కాలిపోతాయి. ఇన్ స్ట్రక్టర్ స్థానంలో ఉన్న వ్యక్తులు తప్పుడు వర్కవుట్లు చేయడం వల్ల ఆయా క్లాసుకు హాజరైన వాళ్లంతా మిస్టేక్స్ చేస్తారు. ఇది మంచి పరిణామం కాదు. ఆరోగ్యకర జీవనశైలి వల్ల ఆరోగ్యకర శరీర బరువును మోయవచ్చు. ఎక్సర్ సైజుల ప్రోగ్రాం వల్ల ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఉండదు.
వర్కవుట్లు చేయడం వల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. చెమట రూపంలో కేలరీలు కరిగిపోతాయి. వర్కవుట్ల వల్ల దాదాపు బరువు తగ్గుతారు. ఒంటి నుంచి చెమట వస్తే శరీరం అంతర్గత వ్యవస్థ అత్యంత క్రియాశీలకంగా ఉన్నట్టు. వర్కవుట్ల వల్ల బరువు తగ్గుతారు. చెమట వస్తుంది అంటే కాలరీలను కాల్చి వేసినట్టే. చాలామంది వర్కవుట్ల మీద ఫోకస్ పెట్టకుండా ఒకరినొకరు మాట్లాడుకుంటారు. అందరూ వర్కవుట్లకు వచ్చినట్టే కానీ ఏ ఒక్కరూ సరిగ్గా వర్కవుట్లు చేయరు. దీనివల్ల వాళ్లే నష్టపోతుంటారు. చాలామంది వర్కవుట్లు చేయకుండా కాలం వెళ్లదీస్తుంటారు. చిత్తశుద్దితో వర్కవుట్లు చేస్తే ఫలితం ఉంటుంది. దీర్ఘకాలంలో చిత్తశుద్దితో వర్కవుట్లు చేస్తే బరువు తగ్గడం, ఎముకలకు సంబంధించిన సమస్యలు లేకుండా జాగ్రత్తపడొచ్చు.
కార్డియో మెషీన్ల మీద ఉన్న స్క్రీన్లను చూసి మోసపోవద్దు. ఎందుకంటే 500 కేలరీలు కాలిపోతే కేవలం 250 కేలరీలు ఖర్చయినట్టు స్క్రీన్ మీద చూపిస్తుంది. చాలామంది చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. దీనివల్ల బరువు తగ్గే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. పత్రికలలో వచ్చే ఆర్టికల్స్ లేదా యాడ్స్ చూసి మోసపోవద్దు. ఎందుకంటే అప్పటికప్పుడు బరువు తగ్గే సాధనాలు ఇంతవరకు రాలేదు. కాబట్టి ఇటువంటి ప్రకటనలు చూసి వేలకు వేలు ఖర్చు చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. ఎక్సర్ సైజులు ఎలా చేయాలో తెలియకుండానే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. మెషీన్ల మీద ఆధారపడి వర్కవుట్లు చేయడం వల్ల ఫలితం శూన్యం. నైపుణ్యం లేనివారిచే శిక్షణ తీసుకోవడం వల్ల మరిన్ని కొత్త చిక్కులు తెచ్చుకున్నట్టే. 21 ఏళ్ల వయసులోపు పిల్లలు జిమ్ కాకుండా స్పోర్ట్స్ ద్వారా ఎక్సర్సైజులు చేయాలి. స్పోర్ట్స్ వల్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది. 22 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్నవాళ్లు జిమ్కు వెళ్లే ముందు డాక్టర్ క్లియరెన్స్ తీసుకోవాలి.
మధుమేహం, రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మీకు చికిత్స చేస్తున్న డాక్టర్ ఎలాంటి వర్కవుట్ సూచిస్తే వాటినే చేయాలి. అతి తక్కువ, అతిగా కూడా చేయకుండా ఆప్టిమల్ లెవల్ అనుసరించాలి. హిమోగ్లోబిన్ నార్మల్గా ఉండాలి. ఎక్సర్సైజులు చేస్తున్నప్పుడు ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను ప్రతీ కణానికి సరఫరా చేస్తుంది. అందుకే హిమోగ్లోబిన్ లెవల్ తప్పనిసరిగా నార్మల్గా ఉండాలి. వర్కవుట్కు ముందు 5-6 బాదాం, 3-6 ఖర్జూరాలు తీసుకుంటే ఆక్సిజన్ అందించే కెపాసిటీ పెరుగుతుంది. బాగా చెమటలు పడుతుంటే, మధ్యలో ఉప్పు కలిపిన నిమ్మరసం కొద్ది కొద్దిగా సిప్ చేస్తుండాలి. వర్కవుట్ పూర్తయిన తర్వాత ఒక పండు, ఒక గుడ్డు తీసుకుంటే బలహీనమైన కండరాలు తిరిగి శక్తిని పుంజుకుంటాయి. దీనివల్ల ఒళ్లునొప్పులు కూడా రావు. వర్కవుట్స్ మొదలెట్టిన తర్వాత నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి. స్టామినాను బట్టి చేయాలి. అంతేగానీ శక్తిని మించి చేస్తే కండరాల నొప్పి, వెన్నునొప్పి వచ్చే ప్రమాదం ఉంది.
సాధారణ వ్యక్తి రోజుకు 30 నిమిషాలు వర్కవుట్స్ చేస్తే సరిపోతుంది. అవసరాన్నిబట్టి పెంచుకుంటూ వెళ్లొచ్చు. ఒకవేళ బాడీ బిల్డింగ్కు వెళ్తున్నవారయితే వారి వర్కవుట్స్ మరోవిధంగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. బరువు తగ్గడానికి వర్కవుట్స్ చేసేవాళ్లు 200 నుంచి 250 క్యాలరీల దాకా ఏరోబిక్ వర్కవుట్స్తో బర్న్ చేయొచ్చు. దీన్ని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్లాలి. బరువు పెరగాలనుకునేవారు కొంతసేపు ఏరోబిక్ చేసి, తర్వాత వెయిట్లిఫ్టింగ్ చేయాలి. ముందు తక్కువ బరువులతో మొదలెట్టాలి. అరగంట ముందు బనానా మిల్క్ షేక్ తీసుకుని వెయిట్లిఫ్టింగ్ చేస్తే ఉపయోగం ఉంటుంది. అందుకే ఎవరి స్టామినాను బట్టి వారి వర్కవుట్స్ ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం ఫాలో అయితే ఫలితం ఉంటుంది.
జిమ్ చేస్తున్నప్పుడుగానీ, వర్కవుట్స్ చేస్తున్నప్పుడుగానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఆహార ప్రణాళిక ఎలా ఉండాలి? ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవడం మంచిది. ఏ వయసువారు ఎలాంటి నియమాలు పాటించాలి? వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్తలు తప్పక పాటిస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి.







