పంటినొప్పి వచ్చిందంటే చాలా ఇబ్బందికరమే. ఏది తిననివ్వదు.. ఏదీ తాగనివ్వదు. కనీసం కాఫీ, టీ లు కూడా తాగడం నరకమే. వయసుతో సంబంధం లేకుండా.. అందరికీ తరచుగా ఇబ్బంది పెడుతుంది పంటి నొప్పి. కొన్ని సందర్భాల్లో పిల్లలు, ఆడవాళ్లు, మగవాళ్లు ఎవరికైనా ఈ సమస్య ఎదురవుతూ ఉంటుంది. పంటినొప్పి వచ్చినప్పుడు ఏమీ తినడం సాధ్యం కాదు కాబట్టి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
పంటినొప్పే కదా అని తేలికగా తీసిపారేయకండి. నొప్పి ఎక్కువవుతుంటే ఏవో నొప్పిని చంపే మాత్రలు వాడితే సరిపోతుందని కొట్టిపారేయకండి. పలు కారణాల వల్ల మీ దంతాలు దెబ్బతింటే దంతాల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. చిగుళ్లు పాడవడం వల్ల హృద్రోగాలు, దంత మూలాలు దెబ్బతినడం లాంటి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పంటినొప్పితో ఇన్ ఫెక్షన్ సోకి అది క్రమంగా ఇతర అవయావాలకు పాకుతుంది. అంతేకాదు కొంతమందిలో పిప్పి పళ్ళు ఉన్నప్పుడు, దంతక్షయం కారణంగా కూడా పంటి నొప్పి వస్తుంది. ఇంకా అనేక సందర్భాల్లో కూడా దంతాలు దెబ్బతినవచ్చు. కోపంలో ఉన్నప్పుడు పళ్ళు కొరకడం వల్ల కూడా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. ఎక్కువ గాఢత ఉన్న కెమికల్స్ తో అదేపనిగా నోటిని పుక్కిలించడం వల్ల దంతాలపై ఉండే డెంటిన్ పొర డ్యామేజ్ అవుతుంది. దీంతో పంటి నొప్పి మొదలవుతుంది. నిమోనియా సోకితే పంటినొప్పి తీవ్రమై ఊపిరితిత్తుల్లో బ్యాక్టీరియా చేరుతుంది. అది గుండెమీద ప్రభావితం చూపుతుంది. దీనికితోడు గుండె సంబంధిత నరాల్లో కొంతభాగం గడ్డకట్టి అది తల, మెడ భాగానికి పాకుతుంది. దీంతో వాయురహితమైన బ్యాక్టీరియా నోటి భాగాన్ని విషపూరితం చేస్తుంది. పంటినొప్పితో మొదలైన అనారోగ్యం గుండెపోటుకు కూడా దారితీస్తుంది. అందుకే నోటికి సంబంధించిన ఏలాంటి సమస్య వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పంటినొప్పికి ప్రధాన కారణం బ్యాక్టీరియా. ఇది యాసిడ్ ను ఉత్పత్తి చేసి టూత్ ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. ఫలితంగా నొప్పి మొదలవుతుంది. సాధారణంగా నోట్లో ఉండే బ్యాక్టీరియా దంతాలపై గారను ఏర్పాటుచేస్తుంది. ఈ గార దంతాల మధ్యన ఏర్పడుతుంది. క్యావిటీస్ వల్ల పంటి నొప్పి వచ్చినట్లయితే ఎనామిల్ దెబ్బతింటుంది. ఒకసారి ఏనామిల్ దెబ్బతింటే తిరిగి పూర్వస్థితి పొందడం సాధ్యం కాదు. పన్ను పుచ్చిపోవడం వల్ల కూడా పంటి నొప్పి వస్తుంది. ఇది నర్వ్ వరకు వెళుతుంది. గమ్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా దంతాల నొప్పులకు కారణమవుతాయి. దంతాల మధ్యన ఆహారపదార్థాలు ఇరుక్కుపోవడం వల్ల చిగుళ్ళ సమస్యలు మొదలవుతాయి. దీర్ఘకాలంలో ఇది పంటినొప్పిని కలిగిస్తాయి. పంటినొప్పికి అల్సర్ కూడా కారణం కావచ్చు. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు, అల్సర్లు కూడా నొప్పికి కారణమవుతాయి. పంటినొప్పి నిమిషాల్లో మాయం చేసే సింపుల్ హోం రెమిడీస్ అందుబాటులో ఉన్నాయి. వెల్లుల్లి ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని మెత్తగా చేయాలి. కొద్దిగా టేబుల్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ కలిపి పంటినొప్పి ఉన్నదానిపై అప్లై చేయాలి. ఇలా ఈ టిప్ ని ఫాలో అవడం వల్ల పంటినొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
దంతాలు తెల్లగా ఎలాంటి నొప్పి లేకుండా మిళమిళ మెరవాలంటే చిట్కాలున్నాయి. ప్రతి ఆరు నెలలకోసారి విధిగా దంతవైద్యుణ్ని సంప్రదించి దంతాలు పరీక్షించుకోవాలి. విధిగా రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. చిగుళ్లు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అతిసున్నితమైన దవడ, చిగుళ్లలో ఏలాంటి బ్యాక్టిరియా చేరినా అది రోగ నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నోటిలో చేరే బ్యాక్టిరియా ఉపిరితిత్తులకు చేరి అది మిగతా అవయావాలకు పాకేందుకు ఎంతో సమయం పట్టదు. అందుకే నోటి శుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిన అవసరాన్ని వైద్యులు నొక్కి చెబుతున్నారు.
చికిత్స జరిగాక కూడా ఇలా మాటిమాటికీ పంటినొప్పి, చిగురు వాపు రావడం పంటి ఆరోగ్యానికి సరైన సూచన కాదు. నొప్పి నివారణ మందులను అదేపనిగా వాడటం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి మళ్లీ అదో సమస్య కావచ్చు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా అవసరాన్ని బట్టి సరైన చికిత్స చేయించాల్సి ఉంటుంది.








