మానవ శరీరములో రక్తప్రసరణ చాలా ముఖ్యమైంది . ఈ శరీరం ఇలా కదులుతోంది అంటే అది రక్త ప్రసరణ వల్లే…రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఎన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం అనేది అన్ని వయస్సుల వారిలోను ఉన్న సమస్య. సమయానికి గుర్తించి వెంటనే చికిత్సను అందివ్వకపోతే బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీ మరియు లింబ్స్ డ్యామేజ్ అయ్యే తీవ్ర ప్రమాధం ఉంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేదని తెలిపే సంకేతాలు కొన్ని ఉన్నాయి
మన శరీరానికి ఆయువు రక్తం. శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగుండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చినా ఏదో ఒక సమస్యకు లోనయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అవయవాలకు రక్తం ప్రసరించడం వల్ల జీవక్రియలు పనిచేయడానికి , అవయవాలకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, మరియు విటమిన్స్ అందిస్తుంది. హార్మోనుల ఉత్పత్తికి మరియు శరీర ఉష్ణోగ్రతలు క్రమబద్దం చేయడానికి రక్తప్రసరణ ఎంతో అవసరం. రక్త ప్రసరణ సరిగా జరగకపోతే, ఆ విషయాన్ని గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది . రక్తప్రసరణ బలహీనంగా ఉన్నదన్న విషయాన్ని ప్రారంభంలో గుర్తించినట్లైతే వెంటనే చికిత్సను అందివ్వొచ్చు . శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోవడం అనేది పెద్దవారిలో చాలా సాధారణం అయినా, ఏవయస్సు వారైనా ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవడం మంచిది. రక్తనాళాల్లో ఫలకం ఏర్పడటం వల్ల మరియు ఇతర కారణాల వల్ల రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దాంతో హార్ట్, చేతులకు, కాళ్ళకు, మరియు శరీరంలోని మరికొన్ని ముఖ్యమైన అలవాయాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ముఖ్యంగా ధూమపానం, వ్యాయామం, ఎక్కువ సమయం కూర్చోవడం, ఆహారపు అలవాట్లు మంచిగా లేకపోవడం, మరియు కొన్ని వైద్యపరిస్థితులు వంటి కొన్ని జీవనశైలిలోని మార్పులు మరియు అలవాట్ల వల్ల ఒక వ్యక్తి ఈ సమస్యలను లోనయ్యే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ మరియు బరువు పెరగడం కూడా బలహీనమైన రక్తప్రసరణకు కారణం అవుతుంది.
సరైన సమయంలో సరైన ఆహారం తీసుకుంటేనే చేసిన వ్యాయామానికి ఫలితం దక్కుతుంది. ఉదయం వేళ వ్యాయామానికి ముందు పిండిపదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర శాతాన్ని కొద్దిమోతాదులో పెరిగి శక్తిని అందిస్తాయి. శరీరం అలసిపోకుండా కావాల్సిన పోషకాలను లభిస్తాయి. వ్యాయామం చేయడానికి ముందు సంక్లిష్ఠ పిండిపదార్థాలు తీసుకొంటే తక్కువ శక్తి, ఫైబర్ ఇతర పోషకాలు ఉంటాయి కనుక శరీరంలో కొవ్వులు ఎక్కువగా నిల్వ ఉండవు. పిండి పదార్థాలు, ప్రొటీన్ కలగలిసిన డైట్ మెనూ రూపొందించుకుంటే వ్యాయామం చేసే వారు హెల్దీగా, ఫిట్ గా ఉండవచ్చు. ఎక్సర్ సైజ్ చేసే ముందు అరటి పండు, నట్స్, ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం మంచిది. ఐతే వ్యాయామానికి వెళ్లే గంట ముందు వరకు మాత్రమే ఇలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి.
ఎనర్జీ డ్రింక్స్ కూడా శరీరానికి హై కేలరీలు అందించే పదార్థాలే. కాబట్టి వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండాలి .. వర్కౌట్లు చేసే వారికి సమతుల ఆహారం ఇంధనం లాంటిది. చాలామంది వ్యాయామం చేసిన తర్వాత పాలు, గుడ్లు, ఉడకబెట్టిన లేదా పచ్చి కాయకూరలు ఆరగిస్తుంటారు. కానీ న్యూట్రిషన్లు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. ఎవరైనా అర్థగంటపాటు వ్యాయామం చేస్తే తిరిగి శక్తిని పుంజుకోవాలంటే ఖచ్చితంగా మంచి పోషకాహారం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా, వ్యాయామం ద్వారా కోల్పోయిన శక్తి తిరిగి పొందేందుకు పిండిపదార్థాలు, కొవ్వు పదార్థాలు అందేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు.పండ్ల ముక్కలను పెరుగుతో కలిపి తీసుకున్నా మంచిదేనంటున్నారు. ఈ తరహా ఆహారం తీసుకున్నట్టయితే తక్షణ శక్తి శరీరానికి అందుతుంది. అన్నిటికంటే ముందు వ్యాయామం తర్వాత, వ్యాయామానికి ముందు, వ్యాయామం మధ్యలో తరచుగా నీరు తీసుకోవడం మంచిది ఇలా చేయడం వల్ల డీహైడ్రేషన్ బారినపడకుండా ఉండొచ్చని వైద్యులతో పాటు న్యూట్రిషన్లు సలహా ఇస్తున్నారు.