Health Tips : ఏ వంటకాలు మంచివి? ఏవి హానికరం?

By manavaradhi.com

Published on:

Follow Us
Healthy Eating Tips

వరి అన్నం, గోధుమలు ప్రజల ముఖ్య ఆహారం. విభిన్న రుచులు, మసాలాలు, పదార్థాలు, వంట విధానాలతో కూడిన భారతీయ వంటలు ఎంతో వైవిధ్యమైనవి. ఎన్నో రకాల శాకాహార, మాంసాహార‌ వంటలకు ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం బిజీబిజీ షెడ్యుల్ తో ప్రీప్యాకేజ్డ్ , ప్రాసెస్ చేసిన ఆహారాల మీద జ‌నం ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుతానికి సౌకర్యవంతంగా భావించి సంత్రుప్తి పడ్డా.. వాటివల్ల కలిగే ఆరోగ్య లాభాలు, నష్టాలను ఖచ్చితంగా ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాలి. వాటి వల్ల పొందే న్యూట్రీషియన్ విలువలను ఎంత వరకూ శరీరానికి అందుతున్నాయో తెలుసుకోవాలి. వేటివల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి వంటి విషయాలు చాలామందికి తెలియవు. పార్టీలకు వెళ్లినప్పుడు నచ్చిన డిష్‌ను అతిగా తినేయ‌డం వ‌ల్ల శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి. పార్టీలో పెట్టిన డిష్‌లో ఏవి తినాలి, ఎంత తినాలి, వేటి జోలికి వెళ్లొద్దు వంటి విషయాలను ముందరే నిర్ణయించుకోవాలి.

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా గ్రీన్ వెజిటబుల్స్‌, పండ్ల‌పైనే ఎక్కువ‌గా దృష్టిసారించాలి. మ‌ల్టీ గ్రెయిన్ ధాన్యాల‌తో ఆహారాలు ఏవైనా మ‌న‌కు మంచి చేస్తాయి. ఫైబ‌ర్‌, ప్రోటీన్‌, విట‌మిన్ బీ6, ఫోలేట్ అధికంగా ల‌భించే ప‌ప్పుతో కూడిన భోజ‌నం మెనూలో ఉండేలా చూసుకోవాలి. గ్రిల్‌ చేసిన మాంసం, చేపల ఆహారం శ‌రీరానికి ఎంతో మంచిది. సలాడ్స్‌ తినొచ్చు. లైటర్‌ డ్రెస్సింగ్‌ ఉన్న సలాడ్స్‌ తినడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదు. డెజర్ట్స్‌ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి. పళ్లతో తయారుచేసిన ఫ్రూట్‌ యోగర్ట్‌ లాంటి డెజర్టులు తింటే పొట్ట తేలికగా ఉంటుంది. హైప్రోటీన్స్ ల‌భించే తందూరి మాంసాహారాలు మంచివే. ఐర‌న్‌, ఫైబ‌ర్‌, ఫొలెట్‌, విట‌మిన్ బీ ల‌భించే చెనా మ‌సాలా తీసుకోవ‌డం మంచిది. సోయా విత్త‌నాలు, సోయా పాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిది. వెన్న‌, తాజా సీజ‌న‌ల్ పండ్ల‌ను తినాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌వేసి చేసే ఆలూ గోబీ కూర చాలా మంచిది.

పంచదార పాకంలో వేసిన రసగుల్లాలు, జిలేబీల జోలికి పోకుండా ఉంటేనే మంచిది. వీటి వల్ల క్యాలరీలు బాగా పెరుగుతాయి. వేపుళ్లను తినొద్దు. ఎక్కువ సాస్‌తో ఉండే స‌లాడ్స్‌కు దూరంగా ఉండడం ఉత్తమం. నాన్ రోటీని తిన‌డం మంచిదికాదు. ఉల్లితోగానీ, ఆకుతోగానీ చేసే ప‌కోడీల్లో నూనె ఎక్కువ‌గా ఉంటున్నందున వీటిని దూరంగా ఉంచాలి. పాల‌క్ లేదా ఆకుకూర‌ల‌తో చేసే ప‌న్నీర్ సాగ్ కు దూరంగా ఉండాలి. ఆలు, ఉల్లి, బ‌ఠానీ, వంటివి ఎక్కువ మ‌సాల‌తో త‌యారుచేసే స‌మోసాల‌ను తిన‌క‌పోవ‌డం ఆరోగ్యానికి ప్ర‌యోజ‌న‌క‌రం. కృత్రిమ స్వీట‌న‌ర్స్ మంచివి కావు. చికెన్ టిక్కా మ‌సాలా, న‌వ‌ర‌త‌న్ కుర్మా, గులాబ్ జామూన్ వంటివి తిన‌కుండా చూసుకోవాలి.

వంట చేసే పద్ధతి మొదలు.. వండిన పదార్థాలు తినే తీరు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు. బ‌య‌టి ఫుడ్స్‌కు స్వ‌స్త‌ప‌లికి ఇంట్లో వండుకున్న వంట‌ల‌నే తిన‌డం అల‌వాటు చేసుకోవ‌డం ద్వారా ఆరోగ్యంగా ఉండ‌ట‌మే కాకుండా ఆర్థికంగా కూడా బాగుంటాం.

Leave a Comment