శుక్రవారం ముంబైకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. సాయంత్రం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్ పవన్ భుజాలకి చికిత్స… కొంత కాలంగా రొటేటర్ కఫ్ గాయంతో భాదపడుతున్న పవన్
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ భుజాలకు సంబంధించిన చికిత్స కోసం రేపు శుక్రవారం ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా ఆయన రొటేటర్ కఫ్ గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. రెండు భుజాల కండరాలు దెబ్బతినడంతో అసౌకర్యం ఎదుర్కొంటున్న ఆయన, ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్లో ఇప్పటికే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది.
అయితే, గత ముంబై పర్యటనలో కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కూడా చేయించుకున్న విషయం విదితమే.. పవన్ 2 భుజాలను పరీక్షించిన వైద్యులు.. రొటేటర్ కఫ్ గాయంతోపాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారించారట.. వెంటనే శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని సూచించారు.. అయితే, ముందుగానే నిర్ణయించిన పలు పాలనాపరమైన, అధికారిక కార్యక్రమాలు ఉండడంతో.. కాస్త గ్యాప్ తీసుకున్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు చికిత్స చేయించుకోవడానికి రేపు ముంబై వెళ్లనున్నారు.
ముంబై పర్యటన ముగించుకుని తిరిగొచ్చాక ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నారు. భుజాల నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు డాక్టర్లు చిన్నపాటి ప్రక్రియ చేయనున్నారు. గాయం త్వరగా నయమై, మళ్లీ పూర్వస్థితికి చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆయన టీమ్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. త్వరలోనే ఆయన తిరిగి తన అధికారిక పనుల్లో పాల్గొంటారు.








