Health Tips : రోగి ఆరోగ్యమే కాదు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి

By manavaradhi.com

Published on:

Follow Us
Managing stress for caregivers

ఆసుపత్రిలో చేరిన నుంచి కోలుకుని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మన వారి ఆరోగ్యం పట్ల మనం ఎంతో శ్రద్థ వహిస్తాం. రోగి ఆరోగ్యమే కాదు మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఎంతైనా మనం ఆరోగ్యంగా వుంటేనే కదా అందరినీ చక్కగా చూసుకోగలిగేది. కాబట్టి కొంచెం ధైర్యంగా, మరికొంచెం జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.

ఇంట్లో ఎవరికన్నా ఏపాటి నలతగా వున్నా వారితోపాటు రాత్రింబవళ్ళు ఉంటూ వారి ఆరోగ్యం బాగయేవరకు నిద్రమేల్కొని మరీ సేవలు చేస్తారు. దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఇన్ని ఒత్తిళ్ళని సైతం భరిస్తూ తమ బాధ్యతలని సక్రమంగా, సరైన సమయంలో పూర్తి చేస్తుంటారు. అయితే కుటుంబ సభ్యుల కోసం ఇంతగా తపించే వాళ్ళు తమ గురించి, తన ఆరోగ్యం గురించి, మానసిక ఆందోళన గురించి ఏమాత్రం పట్టించుకోరు.

ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి సేవలు చేయడంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం వుంటుందంటున్నారు పరిశోధకులు. ఆ ఒత్తిడి వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని కూడా వీరు చెబుతున్నారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డిప్రెషన్ లో ఉండడం కూడా మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసి, తద్వారా శారీరక ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. అందుకే మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. చెడు అలవాట్లు మానుకుని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ, రోజూ వ్యాయామం చేస్తూ, ఒత్తిడికి దూరంగా విశ్రాంతి తీసుకోవాలి

వయసు మళ్ళినవారు, మంచంపై ఉన్న వారి ఆలనా పాలనా చూడటంతో తమపై తాము శ్రద్ధ పెట్టకపోవటం, పూర్తిగా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఒక కారణం అయితే, పోషకాహారం తీసుకోకపోవడం, ఎక్కువ శ్రమపడటం వంటివి మరో కారణం. కాబట్టి తీసుకోనే ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకోవాలి. ఎలాంటి ఆహారాన్ని, ఎంత మేర తీసుకుంటన్నామని గుర్తు పెట్టుకుని మంచి డైట్ తీసుకోవాలి.

నిత్యం ఏదో ఒక పనిలో, ఏదో ఒక ఒత్తిడితో సతమతం అవుతూంటే మెదడుపై భారం పెరిగిపోతుంది. అందువల్ల అప్పుడప్పుడూ.. అన్ని రకాల పనులు, ఒత్తిళ్లకు దూరంగా సరదాగా గడపడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. బ్రిస్క్‌ వాక్‌ వల్ల శరీరం, మెదడు రెండూ చేతనంగా తయారవుతాయి. రోజూ కొద్దిసేపు నలుగురితో కలిసి నవ్వేయండి. మెదడుపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. కంటి నిండా నిద్ర‌పోయేలా చూసుకోవాలి. మంచి నిద్ర ఆరోగ్యానికి ఎంతో అవ‌స‌రం. కాబట్టి ప్రతిరోజు త్వరగా పడుకొని త్వరగా నిద్రలేవాలి.

ఇంట్లోవారి ఆరోగ్యం తప్పకుండా ఒత్తిడికి గురిచేస్తుంది. అయినవారిని అన్నివేళలా కంటికి రెప్పలా కాపాడాలనుకోవటం సహజమే. అయితే అదే సమయంలో తమ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించమని చెబుతున్నారు పరిశోధకులు. ముందుగా పరిస్థితులని యథాతథంగా స్వీకరించడం, తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆందోళనని దగ్గరకి రానీయకపోవడం, మంచి ఆహారాన్ని, విశ్రాంతిని తీసుకోవడం. అందుకోసం ఇంట్లో మిగిలిన సభ్యుల సహాయ సహకారాలని కూడా కోరటం, ఒత్తిడిగా అనిపించినప్పుడు రిలాక్స్‌ అయ్యే టెక్నిక్స్‌ని పాటించడం, వీలయితే ఓ గంట ఒంటరిగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉదయం చేసే వ్యాయామం వల్ల యాక్టివ్ గా మరియు హెల్తీగా ఉంటారు. రోజూ కాసే ఆరోగ్యంగా ఉండాలంటే మానసిక ప్రశాంతత ముఖ్యం. యోగా, ధ్యానం చేయడం వ‌ల్ల ప్ర‌శాంతంగా ఉండి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు.

రోగిని ఆరోగ్యం ఉండేలా చూసుకోవాలంటే ముందు మనం మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. తగుమోతాదులో పౌష్టికాహారం, రోజులో గంట సేపు వ్యాయామం, రిలాక్సేషన్‌ ఎక్స్‌ర్‌సైజులు, తీవ్ర ఉద్రేకాలకు లోనుకాకుండా ఉండాలి. ఎంతటి పెద్ద సమస్యల అయినా కుంగి పోకుండా ఉండేలా మనసును దృఢంగా ఉంచుకోగలగాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం … మనవారిని ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటాం.

Leave a Comment