Meningitis Symptoms: పిలల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్ అవ్వాలి

By manavaradhi.com

Updated on:

Follow Us

మెదడుకు బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్‌పెక్షన్ రావడం వల్లనే మెనింజైటిస్ వ్యాధి సంభవిస్తుంది. దీన్నే మెదడు వాపు వ్యాధిగా పిలుస్తారు. వెన్నెముక, మెదడు చుట్టూ ఉండే ఉమ్మనీటి సంచికి వాపు రావడాన్ని మెనింజైటిస్ గా వ్యవహరిస్తారు. వైరస్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీనికి కారణం అవుతుంది. ఈ వ్యాధి వైరస్ ద్వారా సోకినప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే బ్యాక్టీరియా వల్ల వచ్చే మెనింజైటిస్ మాత్రం తీవ్రమైన ఇన్ఫెక్షన్ గా మారి ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది. ఫలితంగా మెదడుకు తీవ్ర నష్టం కలిగిస్తుంది.

సరైన చికిత్స ఏ మాత్రం అందిచకపోయినా ఎక్కువ శాతం మరణానికి దారి తీస్తాయి. ఒక వేళ ఈ వ్యాధికి మంచి చికిత్స లభించినప్పటికీ… అనంతర పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. మానసిక లోపాలు, మూర్చ, వినికిడి లోపాలతో అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. అంతగా ముందు తరాలకు సమస్యలు తెచ్చిపెడుతోంది మెనింజైటిస్ వ్యాధి.

మెనింజైటిస్ వైరస్ వల్ల సోకుతుంది. సాధారణంగా ఈ వ్యాధి సోకిన వారి ఉమ్ము, కఫం, శ్వాస ద్వారా ఇంకొకరికి సోకుతుంది. ఒక వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకిన కొద్ది రోజులకు వ్యాధి లక్షణాలు మొదలౌతాయి. అలాంటి వైరస్ ఇతరులకు చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. అందుకే ఈ సమస్య వచ్చిందని ఏ మాత్రం అనుమానం వచ్చినా… వెంటనే పూర్తి జాగ్రత్తలు పాటించడం తప్పని సరి.

  • మెనింజైటిస్ కు కారణమయ్యే బ్యాక్టీరియా మనిషి నోట్లో, గొంతులో నిరపాయకరంగా నివసిస్తుంది. ఈ వైరస్ సోకిన రోగులకు జలుబు, దద్దుర్లతో కూడిన చిన్న పాటి జ్వరం రావచ్చు. అతి తక్కువ మందికి మెనింజైటిస్ సోకే అవకాశాలు ఉన్నాయి.
  • వైరస్ ద్వారా వచ్చినా, బ్యాక్టీరియా ద్వారా వచ్చినా మెనింజైటిస్ రెండింటికీ లక్షణాలు ఇంచు మించు ఒకేలా ఉంటాయి.
  • 2 ఏళ్ళ వయసులో పిల్లలకు సాధారణంగా తీవ్రమైన జ్వరం, తలనొప్పి, మెడనొప్పి ఈ వ్యాధి లక్షణాలుగా కనిపిస్తాయి. ఇవి బయట పడడానికి 1 నుండి 2 రోజులు పట్టవచ్చు.
  • కడుపులో వికారం, వాంతులు, కాంతిని చూడలేకపోవడం, అయోమయం, చర్మంపై దద్దుర్లు తదితర సమస్యలు మొదలు కావచ్చు.
  • అప్పుడే పుట్టిన పసిపిల్లలో ఈ లక్షణాలను గుర్తించలేం గానీ… వాంతులు, స్థబ్దుగా ఉండడం, విసుగ్గా ఉండడం, పాలు తాగకపోవడం లాంటి సమస్యలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి.

మెనింజైటిస్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడి, ఆ సమస్యల నుంచి గట్టెక్కడం కంటే, ముందే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.పిల్లలు జబ్బుపడినప్పుడు వారిలో ఎలాంటి లక్షణాలు బయటపడుతున్నాయో జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి.

ఇన్ఫెక్షన్ సోకిన రోగి ఉంటే, తరచూ ఇంట్లో చేతులు శుభ్రం చేసుకోవాలి. వారు వాడిన వస్తువులను, వారున్న ప్రదేశాలను బాగా సబ్బు పెట్టి కడగడం లాంటివి చేయడం ద్వారా ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు. ఈవ్యాధికి గురైన వారు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించడం వల్ల ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

Leave a Comment