ఎండాకాలంలో వేడి, ఉక్కపోతకు ప్రతి ఒక్కరూ అల్లాడిపోవాల్సిందే. ఈ సమయంలో ఒంట్లోని నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ముఖ్యంగా చర్మంలో తేమ తగ్గిపోయి.. త్వరగా పొడిబారిపోతూ ఉంటుంది. పైగా చెమట, ఇతరత్రా కారణాల వల్ల చర్మమ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఐతే ఈ సమస్యను అధిగమించేందుకు వేసవిలోనూ మంచి ఆహారపదార్థాలు ఉన్నాయి.
వేసవిలో ఎండల ప్రభావం శరీరంపై తీవ్రంగా ఉంటుంది. ఒంట్లోని నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. కాబట్టే చర్మం పొడిబారుతూ ఉంటుంది. ఫలితంగా అనేక రకాల చర్మ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఐతే ఇదే సమయంలో డీహైడ్రేషన్ ను తట్టుకునేందుకు చాలా రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆహారాలు ఆరోగ్యంతోపాటు శరీర అంతః సౌందర్యాన్ని కూడా పెంచుతాయి. సమ్మర్ లో మన శరీరానికి ఎక్కువ నీటి శాతం అందాలంటే తాజా పండ్లను ఎంచుకోవాలి. ఇందులో నిమ్మజాతి పండ్లతోపాటు , పుచ్చకాయ, కర్భూజ, మామిడి, దానిమ్మ , జామ లాంటి పండ్లు తీసుకోవచ్చు. వీటిలో ఎక్కువ నీరు ఉండడం వల్ల త్వరగా డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉండదు. పైగా నిమ్మజాతి పండ్ల నుంచి విటమిన్ C తోపాటు యాంటీఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేసేందుకు ఉపయోగపడతాయి.. వేసవి కాలంలో మనకు కీర దోసకాయ కూడా ఎక్కువగా లభిస్తుంంది. వీటిలోనూ నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. పైగా ఇది లో కేలరీ ఫుడ్.. కాబట్టి.. ఎంత తిన్నా సమస్య ఉండదు.
వేసవి కాలంలో వంటింట్లో బార్లీ గింజలు, సగ్గుబియ్యం, సబ్జా గింజలు దర్శనమిస్తాయి. గతంలో నీళ్లు, పాలు, మజ్జిగ వంటివి వాడుతూ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేవారు. నేడు బార్లీ, సగ్గుబియ్యంతో పాటు లస్సీలు, సలాడ్‌లు, జ్యూస్‌లు చేస్తున్నారు. వాడే పదార్థాలు పాతవే అయనా ఈ విభిన్న రుచులను నేడు జనం ఆస్వాదిస్తున్నారు. ఎండాకాలంలో మనకు లభించే మరో కూరగాయ .. రెడ్ బెల్ పెప్పర్. అంటే రెడ్ క్యాప్సికమ్ అన్నమాట. దీనిలోనూ చర్మ సౌందర్యాన్ని కాపాడే పోషకాలు దాగున్నాయి. ముఖ్యంగా మనకు వేసవి కాలంలో చర్మంలో ఉన్న కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల చర్మం ముడతలు పడే అవకాశం ఉంది. ఐతే రెడ్ బెల్ పెప్పర్స్ లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C ఈ సమస్య నుంచి కాపాడతాయి. అందుకే వేసవిలో రెడ్ క్యాప్సికమ్ ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తే మంచిది..
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అందుకని వేసవిలో తేలిగ్గా జీర్ణమై, శరీరం నిర్జలీకరణ జరగకుండా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. వీటిలో పుచ్చకాయ ఒకటి. ఇందులో 90 శాతం కంటే ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. వేసవి దాహాన్ని తీర్చడానికి నీటిని మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసు నీరు తీసుకుంటే చాలు శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతుంటే డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండచ్చు. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే వేసవిలో కచ్చితంగా బీటా కెరటిన్ ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీని వల్ల సూర్యరశ్మి నుంచి వచ్చే దాడిని చర్మం తట్టుకుని నిలబడగలుగుతుంది. బీటా కెరొటిన్ కోసం టమోటాలు, క్యారెట్, బీట్ రూట్ లాంటి కూరగాయలను ఉపయోగించుకోవచ్చు. టమోటాల నుంచి లభించే లైకోపీన్, విటమిన్ C .. చర్మంపై సన్ స్క్రీన్ లా ఉపయోగపడి.. పొడిబారకుండా ఇతర సమస్యలు రాకుండా రక్షిస్తాయి.
ఎండాకాలంలో సరైన ఆహార చిట్కాలు పాటిస్తేనే .. మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. దీంతోపాటు ఇంట్లో వాతావరణం చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో తిరగకూడదు. చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. ఇలాంటి చిట్కాలు పాటిస్తే .. వేసవిలోనూ ఆరోగ్యం, సౌందర్యంతో మెరిసిపోవచ్చు.






