ఏదో ఓ సందర్భంలో చిన్నా చితక గాయల బారిన పడుతూ ఉంటాం. ఇంటి పనులు చేస్తున్నప్పుడు, ఆటలాడేటప్పుడు, వ్యాయామాలు చేసేటప్పుడు పొరపాటున దెబ్బలు తగులుతుంటాయి. వాటిని నిర్లక్షం చేస్తే పుండ్లుగా మారి మనల్ని ఇంకా ఇబ్బంది పెడతాయి. కాబట్టి దెబ్బలు, గాయాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే…!
కొన్ని సార్లు మన శరీరానికి దెబ్బలు తగిలి గాయాలు అవుతాయి. మరికోన్ని సందర్బల్లో ప్రమాదాల్లో శారీరానికి అనుకోకుండ గాయాలు అవుతాయి. చర్మం చిట్లడం , చర్మం గీరుకుపోయి రక్తం రావడం వంటివి జరుగుతాయి. ప్రమాదాలు జరిగినప్పుడు చర్మంతో పాటు కణజాలం కూడా దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భల్లో రక్తం కూడా పోతుంది. శరీరానికి తగిలిన గాయాన్ని నిర్లక్షం చేయండం ద్వారా పుండ్లుగా మారి మరింత భాదిస్తాయి. చాలా మందిలో దెబ్బలు తొందరగా తగ్గిపోవు. అదే విధంగా మధుమేహాంతో భాదపడేవారిలో కూడా గాయాలు అంత త్వరగా మానవు. గాయం అయిన చోట ఇన్ప్లమేషన్ కు గురై వాపు రావడం, ఎర్రబారడంతో పాటుగా నొప్పిగా కూడా ఉంటుంది.
శరీర గాయాలు రకరకాలుగా ఉంటాయి. గాయం ఎంత లోతు వరకూ ఉందో తెలిస్తే… దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. అసలు ఇలాంటి గాయాలు అయినప్పుడు చాలామంది కడగడం, ఐస్ పెట్టడం, బ్యాండ్ ఎయిడ్ వేయడం… వంటివి చేస్తుంటారు. కానీ అలా చేయడం సరికాదు. కాలిన వెంటనే మామూలు నీటితో కడగాలి. తడి తువాలును కాలిన చోట ఉంచాలి. మాటి మాటికీ తడిపి అద్దుతూ ఉండాలి. ఇలా ఓ పది పదిహేను నిమిషాలు చేయాలి.
అదే బాగా లోతుగా కాలితే మాత్రం స్టెరిలైజ్డ్ కాటన్ పట్టీ వేయాలి. అలాకాకుండా బ్యాండేజ్ వేసి గట్టిగా కడితే గాలి తగలక ఇన్ఫెక్షన్ వస్తుంది. వాపు, నొప్పీ బాధిస్తాయి. మచ్చలు పడతాయి. ఒకవేళ బొబ్బలు పెద్దగా వస్తే మాత్రం వైద్యుల్ని సంప్రదించాలి.
చిన్న చిన్న గాయాలు అయినప్పుడు రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుబ్రమైన క్లాత్ తో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్ మెంట్ మరియు ఫౌడర్ ఉపయోగించకూడదు. గాయానికి వాపు రావడానికి వీలుగా బ్యాడెజ్ ను ఒదులగానే కట్టాలి.
ప్రమాదాలనేవి ముందుగా చెప్పిరావు అవి అనుకోకుండా జరుగుతాయి. కాబట్టి ప్రతి ఇంట్లోనూ, వాహనంలోనూ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండడం అవసరం. చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే వాటి ద్వారా ప్రథమ చికిత్స చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే చాలా ఉపయోగం ఉంటుంది.
ప్రతి ఇంట్లో కూడా ప్రథమ చికిత్స కిట్‌లు తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలకు వంట చేసే సమయంలో తెగిన, కాలిన గాయాలవుతుంటాయి. అలాంటి సమయంలో ప్రథమ చికిత్స ద్వారా కొంత ఉపశమనం పొందవచ్చు.