నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని అందరికీ తెలిసిందే. కానీ చాలా మంది ఎప్పుడూ ఏదో పనిలో పడి నీళ్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగే మరికొందరు బాగానే తాగుతున్నాం కదా అని సంతృప్తి చెందుతుంటారు. శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండనివ్వాలి. ఇందుకోసం నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి. కానీ ప్రస్తుత హడావిడి జీవన విధానంలో చాలా మంది తగినన్ని వాటర్ తాగరు. శరీరంలో తగినన్ని నీటి శాతం లేకపోవడం వలన అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
నీరు శరీరాన్ని అవసరమైన విధంగా పని చేస్తుంది. అవయవాలు, కండరాలు మరియు కీళ్ళు అన్నింటికీ ఇది అవసరం. ఇది రోగనిరోధక వ్యవస్థ జెర్మ్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. నీరు త్రాగడం వల్ల బరువు తగ్గవచ్చు మరియు మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే అవకాశాలను కూడా తగ్గించవచ్చు. శ్వాసవ్యవస్థ, జీర్ణ వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. మనం తాగే నీటి నుంచే రక్త కణాలకు పౌష్టికాలను సరఫరా అవుతుంది. అలాగే చర్మం తడిగా ఉండేలా చేయడంతోపాటు వ్యర్ధ పదార్ధాలను స్వేదం ద్వారా బయటకు విసర్జింపజేస్తుంది. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ అంతర్గతంగా మనిషికి ఎంతో మేలు చేస్తుంది.
రోజుకి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం మంచిది. వ్యాయామం చేసేవారు మరో నాలుగు గ్లాసుల నీటిని అదనంగా తాగాలి. గర్భిణులు, బాలింతలు ఎక్కువ నీటిని తీసుకోవాలి. జ్వరం, విరోచనాలు, మూత్రనాళంలో రాళ్ళు ఉన్నవారు సాధ్యమైన మేర ఎక్కువగా నీటిని త్రాగాలి. ఈ నీరు మనకి కూరగాయలు, జ్యూస్, సూప్స్ లలో ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే మన రోగనిరోధక వ్యవస్థ నియంత్రణలో ఉంటుంది. శరీర అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి.

శరీరానికి నీరు ఎంతో అవసరమైనది. అలాగని కేవలం మంచినీరు తాగడం వల్లనే కాకుండా ఇతరత్రా విధానాల వల్ల కూడా ద్రవాలను శరీరానికి అందించవచ్చు. మనం నిత్యం తీసుకొనే ఆహారాల ద్వారా 20 శాతం నీరు మనకు అందుతుంది. పుచ్చకాయ, దోసకాయ, టోమాటోల వంటి కూరగాయలు, పండ్లను ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. వెజ్, నాన్బెజ్ సూపుల ద్వారా కూడా శరీరానికి నీరు అందివ్వవచ్చు.
మిల్క్ షేక్స్, బాదాం షేక్స్ వంటివి కూడా తీసుకుంటుండాలి. కూరల్లో నీరు పోయాల్సి వచ్చినప్పుడు నిమ్మరసం వేయడం చాలా మంచిది. దీంతో శరీరానికి కావాల్సిన కణాల వృద్ధికి అవసరమైన యాంటిఆక్సిడెంట్స్, పొటాషియం దొరుకుతాయి. కొంచెం ఉప్పుతో చేసిన పీనట్స్గానీ, పాప్కార్న్గానీ మధ్యాహ్నం సమయంలో తినడం వలన గ్లాస్ నీరు తాగాలనే కోరిక కలుగుతుంది.
ఉదయాన్నే నీరు తాగడం వలన జీవక్రియలు సక్రమంగా సాగడమేకాకుండా ఎనర్జీ అందుతుంది. అలాగే ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్ ను నివారించానికి గొప్పగా సహాయపడుతుంది. ఉదయాన్నే తక్కువ కాఫీ వేసుకొని రెండుసార్లకు మించకుండా తాగడం వల్ల శరీరానికి నీరు అందుతుంది. అయితే చక్కెర తక్కువగా వినియోగించడం, క్రీమ్లేకుండా చూసుకోవాలి. అలాగే ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లే సమయాల్లో, పనిపై బయటకు వెళ్లాల్సివస్తే తప్పనిసరిగా నీటి బాటిల్ వెంట తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి.
భోజనానికి కూర్చునే అర గంట ముందు గ్లాసెడు నీరు తాగాలి. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. అప్పుడప్పుడు మసాలా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఎక్కువగా నీరు తాగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కడుపులో మంటగా అనిపించగానే పాలుగానీ నీరు గానీ తీసుకోవాలి. దప్పిన అయిన ప్రతిసారే కాకుండా మూత్రం పసుపురంగులో వచ్చినప్పుడు కూడా ఎక్కువ నీరు శరీరానికి అవసరమని గుర్తుంచుకోవాలి.
రోజంతా నీరు తాగుతూ ఉండాలి. కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. అలాగే, నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, కుకుంబర్, క్యాప్సికం, పాలకూర, ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లూ కూరగాయలూ తీసుకోండి.అయితే ఏదైనా కూడా మోతాదుకు మించి చేయకూడదని పెద్దలు అంటారు . నీరు కూడా అంతే.! మోతాదుకు మించి నీళ్లు తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి.