Liver Failure Symptoms : ఎలాంటి లక్షణాల ద్వారా కాలేయ సమస్యలను గుర్తించవచ్చు ?

By manavaradhi.com

Updated on:

Follow Us

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం సక్రమంగా పనిచేయాలి. ఎందుకంటే తీసుకున్న ఆహారం జీర్ణమైతేనే ఆహారంలోని శక్తి శరీరానికి అందుతుంది. శక్తి ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అన్ని అవయవాలు పనిచేస్తాయి. శక్తి లేకపోతే శరీరంలోని అవయవాలు పనిచేయవు. మారుతున్న జీవనశైలి, ఇతర కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న కాలేయ సమస్యలు కలుషిత నీరు, ఆహారం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం సంబంధిత వ్యాధులు సోకుతున్నాయి. తద్వారా ఆ అవయవం దెబ్బతింటుంది. ముఖ్యంగా హెపటైటిస్ వైరస్లు సోకడం వల్ల కామెర్లు రావడం, కాలేయానికి వాపు ఏర్పడడం, పొక్కులు రావడం వంటి సమస్యలు వస్తాయి. అయితే, మిగిలిన వాటిలాగా కాలేయానికి సంబంధించిన జబ్బులు అంత త్వరగా బయట పడవు. అందుకోసం ముందుగా వ్యాధి నిర్ధారణ కోసం లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకోవల్సి ఉంటుంది.

  • కాలేయానికి సోకే ఎలాంటి వ్యాధిలోనైనా ఒకే రకమైన లక్షణాలు కనిపిస్తాయి. కాలేయానికి సమస్య వచ్చినప్పుడు ముఖ్యంగా ఆకలి మందగించటం వంటి లక్షణం కనపడుతుంది.
  • దీంతో పాటు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి, అలసట, నీరసం, మూత్రం పచ్చగా రావటం, చర్మం, కళ్లు పసుపు పచ్చగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తే కాలేయానికి సమస్య వచ్చినట్లుగా గుర్తించాలి.
  • తలనొప్పి, ఒళ్లు నొప్పి లాంటి వాటికి సంబంధించి వైద్యుల సలహా లేకుండా తీసుకునే మాత్రలు సైతం కాలేయ సంబంధ సమస్యలకు కారణం అవుతాయి. అందుకే ఎలాంటి నొప్పులు ఎదురైనా, వైద్యుల సలహా లేకుండా సొంత వైద్యం చేసుకోవడం మంచిది కాదు.
  • గర్భిణి స్త్రీలు, ఇతర ఔషధాలు వాడుతున్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండడం అవసరం. అదే విధంగా ఇప్పటికే వైద్యుని సలహాతో ఈ మాత్రలు వాడుతున్న వారు మోతాదును పరిశీలించుకోవడం చాలా అవసరం. ఎప్పటికప్పుడు మోతాదును పరిశీలించుకుని నొప్పి మాత్రలను తగ్గించుకోకపోతే, కాలేయానికి సంబంధించిన సమస్యలు మరింత ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది.
  • మన కాలేయ ఆరోగ్యం దెబ్బతినడానికి చాలారకాల కారణాలు ఉన్నాయి, అతిగా ఆహారం తినడం, జంక్ ఫుడ్, వేపుళ్లు తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పనిభారం, పొగతాగడం, మద్యం సేవించడం… వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
  • ప్రతి రోజూ వాకింగ్ చేయడం, కండరాలను బలోపేతం చేసే వ్యాయామం చేయడం ద్వారా ప్రాణాంతక కాలేయ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
  • ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. శరీర బరువు అదుపులో ఉంచుకోవాలి. శుభ్రమైన ఆహారం, నీరు తాగాలి.
  • ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఒబేసిటీ కూడా కాలేయ వ్యాధులకు కారణమవుతున్నట్లు తేల్చారు. కాబట్టి అధిక బరువును అదుపులో ఉంచుకోవాలి.లివర్‌ వ్యాధులను నివారించుకోవడానికి హెపటైటిస్‌ బి వ్యాక్సిన్‌ తీసుకోవాలి. కాలేయంకు సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

Leave a Comment