Digestive Health : జీర్ణక్రియకు మేలు చేసే, కీడు చేసే ఆహారాలు ఏంటి..?

By manavaradhi.com

Published on:

Follow Us

ఆహారము జీవిత ముఖ్య అవసరములలో ఒకటి. మన ఎదుగుదలకు, అనేక శరీర కార్యక్రమలకు ఆహారం అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే తగిన పరిమాణంలో సమతులాహారాన్ని తీసుకోవాలి. మన శరీరానికి అన్ని ఆహారాలు శక్తిని ఇస్తాయి. కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకోవడం కంటే ఎలాంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకోవడం ముఖ్యం.

కొన్ని ఆహారాలు జీర్ణం అవ్వడానికి కష్టం అవుతాయి. అటువంటి ఆహారాలను మనం మనకు తెలియకుండాన్నేప్రతి రోజూ మనం తీసుకుంటుంటాము. అందువల్ల , మీకు ఏదైనా జీర్ణ సమస్యలేవైనా ఉన్నట్లైతే, మీరు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల మీద శ్రద్దపెట్టి, ఎటువంటి ఆహారాలు తీసుకుంటున్నారో తెలుసుకోవాలి. మీరు రెగ్యులర్ గా తీసుకొనే అన్ని ఆహారాల్లోకి ఏదో ఒక ఆహారం మీ జీర్ణక్రియకు అంతరాయం కలుగజేస్తుండవచ్చు. అలా జీర్ణక్రియకు అంతరాయం కలిగించే కొన్ని ఆహారాలనుగురించి తెలుసుకొని వాటికి దూరంగా ఉండటం మంచిది. అప్పుడే మన జీర్ణవ్యవస్థ ఏఆటంకం లేకుండా సక్రమంగా పనిచేస్తుంది.

 • మనకు త్వరగా జీర్ణం కానీ ఆహారాలను తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. బాగా వేయించిన వేపుడు పదార్ధాలు త్వరగా జీర్ణం కావు .
 • నూనెలో వేయించిన ఆహారాలు చాలా కష్టంగా జీర్ణం అవుతాయి. ఎందుకంటే వాటిలో అధిక నూనె వుంటుంది. అది మీ జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. పాస్తా, కుకీలు, కేకులు అతిగా తినడం మంచిది కాదు. వీటిని కొంత వరకు తీసుకుంటే పరవాలేదు. కానీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలు ఎదురౌతాయి.
 • మసాలా ఆహారాలు ,పచ్చి మిరపకాయలు, మిరియాల వంటివి కూడా అజీర్ణం కలిగిస్తాయి. సిట్రస్ పండ్ల రసాలు కూడా అజీర్ణం కలిగిస్తాయి. ఆహార గొట్టం కణాలను ఇబ్బందిపెట్టి ఆహారం వెలుపలికి వచ్చేలా చేస్తాయి. ప్రత్యేకించి వీటిని సరైన సమయంలోనే తీసుకోవాలి.
 • ఆకు కూరలు, క్యాబేజి, బ్రోకోలి, ముల్లంగి వంటివి బరువైన ఆహారాలు. ఎందుకంటే, అవి త్వరగా జీర్ణం కావు. వీటిలో ఆలిగో సచ్చరైడ్స్ అనే పదార్ధం వుంటుంది. ఈ రకమైన ఆహారాలు జీర్ణం చేయటానికి అవసరమైన లాక్టేస్ మానవులలో వుండదు. తగిన మోతాదులో తీసుకుంటే మంచేదే కాని ఎక్కువగా తనండ వల్ల త్వరగా జీర్ణం కాదు.
 • తర్వగా జీర్ణం కాని ఆహార పదార్థాల్లో పిజ్జా కూడా ఒకటి. పిజ్జా త్వరగా జీర్ణం కాదు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది . దానికి తోడు క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి.
 • లాక్టోస్ అనేది పాలలో వుండే ఒక రకమైన షుగర్. ఇది పాల ఉత్పత్తి. సాధారణంగా 70 శాతం పెద్ద వారికి ఎంతో కొంత లాక్టోస్ సరిపడకపోవటం వుంటుంది. వీరు లాక్టోస్ కల ఆహారాలు జీర్ణించుకోలేరు.
 • స్పైసీ ఫుడ్స్ కారంగా ఉండే ఆహారాలు మీ టేస్ట్ బడ్స్ కు రుచికల్పించవచ్చు. కాకపోతే ఫ్రైడ్ ఫుడ్స్ లో ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉంటుంది . అందువల్ల ఇటువంటి ఆహారాలు జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.
 • పచ్చి ఉల్లిపాయలు పొట్టలో గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది అందువల్ల జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాలీఫ్లవర్ వెజిటేబుల్స్ లో చాలా వరకు న్యూట్రీషియన్స్ ఉంటాయి. కానీ రఫినోస్ వల్ల ఇవి జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది.
 • క్యాబేజ్ లో కూడా ఓలిగోసచ్చారైడ్, కలిగి ఉండం వల్ల జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. పాస్తా చాలా మంది ఫేవరెట్ డిష్. అయితే, దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల బాడీలో జీర్ణం అవ్వడానికి కొంచెం కష్టం మారుతుంది.
 • హార్డ్ చీజ్ వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇంకా ఫ్యాట్ మరియు లాక్టోజ్ లు కూడా అధికంగా ఉంటాయి . జీర్ణం కానీ ఆహారాల్లో ఇది మరో ఆహారం.
 • బీన్స్ లో ఓలిగోసచ్చార్డే అనేటువంటి షుగర్ కంటెంట్ ఉండటం వల్ల ఇది అంత తేలికజీర్ణం కాదు. కానీ వీటిని తగినమోతాదులో తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Leave a Comment